More ...

Tuesday, December 22, 2020

BSNL Broadband PlansRead also:

BSNL Broadband Plans:కస్టమర్లకు బీఎస్ఎన్‌ఎల్ శుభవార్త.బ్రాండ్‌బ్యాండ్ ప్లాన్ల సవరింపు

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. తన ఫైబర్ బ్రా ప్లాన్లలో సవరణలు చేసింది. ఈ ప్లాన్ల ద్వారా రెట్టింపు వేగంతో అధిక డేటాను అందివ్వడమే కాకుండా, అదనపు ఆఫర్లను కూడా ప్రకటించింది. సవరించిన డేటా ప్లాన్లు దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలోని వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. దీనితో పాటు ప్రత్యేకంగా చెన్నై సర్కిల్‌(Chennai circles)లోని భారత్ ఫైబర్(Bharat Fibre) బ్రాండ్ వినియోగదారులకు అదనపు డేటా ఆఫర్ను కూడా ప్రకటించింది. అదేవిధంగా, నూతనంగా ప్రవేశపెట్టిన కొన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌(broadband)లలో ఇతర ప్రయోజనాలతో పాటు డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం మెంబర్ షిప్‌ను కూడా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. కాగా, డేటా ప్లాన్లలో చేసిన నూతన సవరణలను BSNL తన వెబ్‌సైట్‌లో అధికారికంగా ప్రకటించింది. అన్ని బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లలో కెల్లా అతి తక్కువ ధరకు లభించే రూ.499 విలువ గల ప్లాన్లో సవరణలు చేసింది. ఈ ప్లాన్తో అంతకుముందు 20 Mbps వద్ద 100 జిబి డేటా లభించేది.


కాగా, ప్రస్తుతం ఈ ప్లాన్తో 50 Mbps వద్ద 100GB డేటాను అందుకోవచ్చు. దీనితో పాటు నెలకు 300 జీబీ ఆఫర్ చేసే రూ.799 ప్లాన్లో కూడా మార్పులు చేసింది. ఈ ప్లాన్తో ఇదివరకు కేవలం 50 Mbps స్పీడ్ మాత్రమే వచ్చేది. సవరించిన ప్లాన్ ప్రకారం 100 Mbps డేటా వేగాన్ని పొందవదచ్చు. కాగా, ఈ ప్లాన్ కింద లభించే 300GB హై-స్పీడ్ డేటా లిమిట్ పూర్తయితే, ఇంతకు ముందు కేవలం 2 Mbps వేగం మాత్రమే వచ్చేది. ప్రస్తుతం దీన్ని 5 Mbps స్పీడ్కు పెంచింది. దీనితో పాటు ఈ ప్లాన్ కింద డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం చందా కూడా ఉచితంగా లభిస్తుంది.

రూ.1,999 ప్లాన్తో 200 mbps వేగం గల 4TB డేటా లభ్యం.

ప్రస్తుతం నెలకు రూ .849 ఖర్చవుతున్న 600 GB సియుఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ ఇకపై 100 Mbps వేగంతో లభిస్తుంది. కాగా, ఈ ప్లాన్తో ఇది వరకు కేవలం 50 Mbps వేగం మాత్రమే వచ్చేది. ఈ ప్లాన్ కింద లభించే 600GB హై-స్పీడ్ డేటా పూర్తయిన తర్వాత, వినియోగదారులు 2 Mbps వేగాన్ని పొందేవారు. కాగా సవరించిన ప్లాన్ ప్రకారం 2 Mbpsకు బదులుగా 10 Mbps వేగాన్ని పొందవచ్చు. అదే విధంగా, రూ.949లకు లభించే భారత్ ఫైబర్ ప్లాన్తో 500GB వరకు 100 Mbps వేగంతో పొందవచ్చు. డేటా లిమిట్ పూర్తయిన తర్వాత డేటా వేగం 10 Mbpsకు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్తో డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది.


BSNL కొత్తగా సవరించిన ప్లాన్లలో రూ.1,277 ధర వద్ద లభించే భారత్ ఫైబర్ ప్లాన్ కూడా ఉంది. ఇది ప్రస్తుతం 200 Mbps వేగంతో 3.3 టిబి వరకు హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ డేటా లిమిట్ పూర్తయిన తర్వాత స్పీడ్ 15 Mbps కు తగ్గించబడుతుంది. చివరగా, రూ.1,999 ధర వద్ద గల ప్లాన్ 200 Mbps వేగంతో 4TB డేటాను అందిస్తుంది. డేటా లిమిట్ పూర్తయిన తర్వాత డేటా స్పీడ్ 200Mbps వేగానికి తగ్గించబడుతుంది. కాగా, చెన్నై సర్కిల్కు చెందిన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా, ఫైబర్ బేసిక్, ఫైబర్ ప్రీమియం, ఫైబర్ అల్ట్రా, ఫైబర్ వాల్యూ ప్లాన్‌లు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. ఫైబర్ బేసిక్, ఫైబర్ వాల్యూ ప్లాన్‌లలో వరుసగా 30 Mbps, 100 Mbps వేగంతో 3.3 TB డేటాను ఉపయోగించుకోవచ్చు. కాగా, ఫైబర్ ప్రీమియం, ఫైబర్ అల్ట్రా ప్లాన్లతో వరుసగా 200 Mbps, 300 Mbps వేగం గల 4TB డేటా లభిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :