Sunday, December 20, 2020

BOB Recruitment 2021



Read also:

BOB Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Bank Jobs: నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank Of Baroda) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం దరఖాస్తల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, జనవరి 8న ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడాలోని బ్రాంచుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వార అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అప్లికేషన్ ఫీజును రూ. 600గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు కేవలం రూ. 100 ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

ఖాళీలు, అర్హతల వివరాలు

స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు (ఎస్‌వో), ఫైర్‌ ఆఫీసర్ల విభాగంలో ప్రస్తుతం పోస్టులను భర్తీ చేయనున్నారు. స్పెషల్ ఆఫీసర్ల విభాగంలో 27 పోస్టులు, ఫైర్ ఆఫీసర్ విభాగంలో 5 ఖాళీలు ఉన్నాయి. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డిగ్రీ అర్హత ఉండాలి. 25 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ(ఫైర్‌), ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 23 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే

-అభ్యర్థులు మొదట బ్యాంకు అధికారిక వెబ్ సైట్ bankofbaroda.co.inను ఓపెన్ చేయాలి.

-అనంతరం "Career" ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

-అక్కడ మనం అప్లై చేయాల్సిన పోస్లు పక్కన ఉన్న Link to apply Security Officers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

-ఫాం మొత్తం నింపి కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.

-అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

Notification Direct Link 

Apply Here

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :