Sunday, December 27, 2020

ఉపాధ్యాయ బదిలీలు-ఫ్రీజ్‌ చేసిన వెబ్‌ఆప్షన్ల సవరణకు అవకాసం



Read also:

ఫ్రీజ్‌ చేసిన వెబ్‌ఆప్షన్ల సవరణకు అవకాశ0 తప్పని సరి బదిలీ అయ్యే వారికి మాత్రమే వెసులుబాటు ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్‌ ఆప్షన్లు అప్‌లోడ్‌ చేసి ఫ్రీజ్‌ చేసిన తర్వాత కూడా సవరణకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. టీచర్ల బదిలీలు వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానంలో జరుగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు తాము కోరుకునే స్థానాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం మండల విద్యాధికారి కార్యాలయాల్లో ఎంఈవో లాగిన్‌లో మాత్రమే వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. వాటిని నమోదు చేసి ఫ్రీజ్‌ చేసిన తర్వాత మళ్లీ ఆప్షన్లను సవరించేందుకు ఎంఈవో లాగిన్‌లో కుదరదు. దీనికోసం డీఈవో కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. వెబ్‌ఆప్షన్ల సవరణకు అనుమతించాలని కోరుతూ డీఈవోకు అభ్యర్థనపత్రం రాసి ఎంఈవోతో దానిని ధ్రువీకరించి ఆయన లాగిన్‌ ద్వారా డీఈవోకు మెయిల్‌ పంపించాలి. డీఈవో ఆ మెయిల్‌ను పరిశీలించి అంగీకరిస్తే ఆయన కార్యాలయ సిబ్బంది ఆప్షన్లు సవరించుకునేందుకు వీలుగా అన్‌ఫ్రీజ్‌ చేస్తారు. తర్వాత ఉపాధ్యాయులు వెబ్‌ఆప్షన్లు సవరించి ఫ్రీజ్‌ చేయవచ్చు. ఈ అవకాశాన్ని తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులకు మాత్రమే కల్పించారు. అభ్యర్థన మేరకు బదిలీ దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులకు ఈ వెసులుబాటు లేదు.

Transfers Complete information   Ammavodi Complete Information

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :