Monday, December 7, 2020

రేపు విద్యా సంస్థల బంద్



Read also:

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. డిసెంబర్ 8న భారత్ బంద్ జరగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటల తర్వాత అన్ని కార్యక్రమాలు యధావిధిగా జరుపుకోవచ్చు. రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు పలికింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారత్ బంద్ పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పిలుపునిచ్చారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు టీ కాంగ్రెస్ పార్టీ కూడా భారత్ బంద్‌కు మద్దతు పలికింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే వారు 10 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నారు. రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయ మంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రి లాంటి వారు కూడా చర్చలు జరిపారు. కానీ, చర్చలు ఫలప్రదం కాలేదు. దీంతో డిసెంబర్ 8న దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

భారత్‌ బంద్‌ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు దీక్ష చేపట్టిన విషయం విదితమే. రైతన్న దీక్షకు మోదీ సర్కార్ దిగిరాకపోవడంతో.. రైతులపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న (బుధవారం) రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్నటి వరకూ ఈ బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోని ఏపీ ప్రభుత్వం.. రేపు బంద్ అనగా.. ఇవాళ సాయంత్రం తన నిర్ణయాన్ని ప్రకటించింది. 

బంద్‌కు మద్దతు

భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బంద్ సందర్భంగా రేపు ఏపీలో విద్యా సంస్థలు బంద్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒంటి గంట తర్వాతనే ప్రభుత్వ కార్యాలయాలను తెరవాలని ఆదేశించింది. ఏపీలో ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బంద్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రైతు సంఘాలకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :