Wednesday, December 16, 2020

సీపీఎస్ విధానంపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన



Read also:

  • ఉపాధ్యాయుల ఛలో అమరావతిపై స్పందించిన మంత్రి ఆదిమూలపు సీపీఎస్ విషయంలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని, సీపీఎస్ రద్దు అంశంపై 2019లొనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, వర్కింగ్ కమిటీలను ప్రభుత్వం నియమించిందని పేర్కొన్నారు.
  • ఈ రెండు కమిటీలు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాయని సీపీఎస్ రద్దు వ్యవహారంపై సలహాలు ఇచ్చేందుకు.. నివేదిక ఇచ్చేందుకు ఓ సంస్థను నియమించామని అన్నారు.
  • సీపీఎస్ పై అధ్యయనం కోసం కె.ఏ పండిట్ అనే సంస్థను నియమించామన్న ఆయన పాత పెన్షన్ విషయంలో త్వరలోనే నిర్ణయం ఉంటుందని అన్నారు.
  • ఇక ఉపాధ్యాయుల బదిలీల వెబ్ అప్షన్స్ గడువును 17 తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశామన్న ఆయన బదిలీ కావాల్సిన 76, 119 మంది ఆన్లైనులో వెబ్ అప్షన్లను తప్పనిసరిగా ఎంచుకోవాల్సి ఉందని వారిలో 90 శాతం మంది ఎంచుకున్నారని కంపల్సరీ ట్రాన్సఫర్లు కావాల్సిన ఉపాద్యాయులు 26 వేల మంది కూడా అప్షన్లు చేశారని అన్నారు.
  • ఇక రిక్వెస్ట్ ట్రాన్స్ఫరులు 46,818 మంది కూడా వెబ్ అప్షన్స్ ఇచ్చారని ఇప్పటిదాకా మొత్తంగా 90 శాతం వరకు ఆప్షన్లు ఇచ్చారని అన్నారు.
  • ఉపాధ్యాయుల ఆందోళనలు టీ కప్పులో తుఫాను మాత్రమేనని ఈ అంశంపై కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
  • తాము ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పారదర్శకంగానే చేస్తున్నామని అన్నారు.
  • అందరికి నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతోనే కొన్ని పోస్టులు బ్లాక్ చేశామని ఈ పోస్టుల బ్లాకింగ్ అనేది కొత్త ప్రక్రియ కాదని ఆయన అన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :