Tuesday, December 8, 2020

ఏలూరులో అస్వస్థతకు "లెడ్" హెవీ మెటల్‌ కారణం బాధితుల శాంపిల్స్‌ రిజల్ట్స్‌ను వెల్లడించిన ఎంపీ జీవీఎల్‌



Read also:

ఏలూరులో అస్వస్థతకు "లెడ్" హెవీ మెటల్‌ కారణం బాధితుల శాంపిల్స్‌ రిజల్ట్స్‌ను వెల్లడించిన ఎంపీ జీవీఎల్‌

క్షణక్షణం భయం భయం. ఎప్పుడు ఏమవుతుందో తెలీని గందరగోళం. అంతుచిక్కని మాయదారిరోగఎప్పుడు, ఎవర్ని కాటేస్తుందో తెలీని భయాందోళన. ఏలూరులో ఎటు చూసినా ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర అంబులెన్స్‌ల సైరన్‌ చప్పుడు, బాధితుల ఆర్తనాదాలు, వాళ్ల కుటుంబ సభ్యుల కన్నీళ్లే కనిపిస్తున్నాయి. అయితే ఏలూరులో అస్వస్థకు లెడ్ హెవీ మెటల్ కారణం అని పరీక్షల వివరాలు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.

ముందు నుంచి అనుమానినించినట్లే పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్‌లో ఎక్కువగా “లెడ్” అనే హెవీ మెటల్, మరియు నికెల్ అనే మెటల్ ఎక్కువుగా ఉన్నట్లు ఢిల్లీలోని ఎయిమ్స్ నిర్వహించిన పరీక్షల్లో తెలింది.

లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తాయని వారు వెల్లడించారు.

“లెడ్” బ్యాటరీస్‌లో ఉండే పదార్ధం. ఇది తాగు నీటి ద్వారా, లేదా పాల ద్వారా పేషెంట్స్ శరీరంలో వెళ్లి ఉండవొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. సాంపిల్స్ టెస్ట్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ మంగళగిరి ద్వారా అందజేయటం జరిగింది. వెంటనే ఏ మార్గం ద్వారా వారి శరీరాల్లో ప్రవేశించిందో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ స్థానికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. వాటర్, పాల శాంపిల్స్ పంపించాలని ఎయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడుగుతోంది. మెటల్స్ ను డిటెక్ట్ చేసే అధునాతన పరికరాలు ఎయిమ్స్ ఢిల్లీలో మాత్రమే ఉన్నాయి. ఇక ఈ రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించాల్సి ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :