Thursday, December 31, 2020

న్యూఇయర్ గిఫ్ట్‌ పీఎఫ్ వడ్డీ పడింది ఇలా చెక్ చేసుకోండి



Read also:

న్యూఢిల్లీ: ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది ఈపీఎఫ్‌వో. 2019-20 ఏడాదికిగాను 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్ ఖాతాల్లో గురువారం జమచేసింది. ఈ ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వడ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్‌వో నిర్ణయించింది. అయితే కరోనా కారణంగా ఈ వడ్డీ రేటును విభజించి రెండు విడతలుగా ఇస్తామని సెప్టెంబర్‌లో ప్రకటించింది. మొదటి విడతగా 8.15 శాతం, రెండో విడతగా 0.35 శాతం ఇవ్వనున్నట్లు తెలిపింది. చివరికి కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఒకేసారి 8.5 శాతం వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలో వేసింది.

ఎలా చెక్ చేసుకోవాలి?

పీఎఫ్ బ్యాలెన్స్‌ను నాలుగు మార్గాల్లో తెలుసుకోవచ్చు.

ఎస్సెమ్మెస్‌, ఆన్‌లైన్‌, మిస్డ్ కాల్ లేదా UMANG యాప్ ద్వారా తెలుసుకోవచ్చని గతంలో ఈపీఎఫ్‌వో ప్రకటించింది.

1. UMANG యాప్ ద్వారా: ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఈపీఎఫ్‌వోలోకి వెళ్లి ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి. మీ యూఏఎన్ నంబర్‌లో పాస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేసి పాస్‌వర్డ్ నమోదు చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీనిని ఎంటర్ చేస్తే పీఎఫ్ బ్యాలెన్స్ తెలిసిపోతుంది.

2.ఈపీఎఫ్‌వో పోర్టల్ ద్వారా: మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్‌)ను మీ అకౌంట్‌ను ట్యాగ్ చేసి ఉంటే పోర్టల్ ద్వారా మీ పీఎఫ్ పాస్‌బుక్‌ను చూడవచ్చు. epfindia.gov.inలోకి వెళ్లి ఇ-పాస్‌బుక్‌లో మీ యూఏఎన్ నంబర్‌, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే మీరు పాస్‌బుక్ పేజీలోకి వెళ్లవచ్చు.

3. ఎస్సెమ్మెస్ ద్వారా: ఒకవేళ మీ యూఏఎన్ నంబర్ ఈపీఎఫ్‌వోతో రిజిస్టర్ అయి ఉంటే.. ఎస్సెమ్మెస్ ద్వారా కూడా మీ తాజా పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌, బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీనికోసం EPFOHO UAN ENG మెసేజ్‌ను 7738299899 నంబర్‌కు ఎస్సెమ్మెస్ చేయాలి. ENG అనేది మీకు కావాల్సిన భాషలోని మొదటి మూడు అక్షరాలు.

4. మిస్డ్ కాల్ ద్వారా: ఒకవేళ మీ యూఏఎన్ నంబర్ ఈపీఎఫ్‌వోతో రిజిస్టర్ అయి ఉంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :