Friday, December 25, 2020

అమ్మఒడి అనర్హుల్లో అయోమయం-ఎక్కడికెళ్లినా తెలీదన్న సమాధానమే



Read also:

  • అమ్మఒడి అనర్హుల్లో అయోమయం
  • అనర్హత, విత్‌హెల్డ్‌కు కారణాలు చెప్పేవారు కరువు
  • సచివాలయాల్లో ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వని వైనం
  • పాఠశాలల్లోనూ అదే పరిస్థితి
  • సవరణలకు నేటితో ముగియనున్న గడువు

అమ్మఒడికి ఎందుకు  అనర్హులుగా ప్రకటించారు..? ఏ కారణంతో తిస్కరించారు..? వం టి ప్రశ్నలు వేలాదిమంది తల్లులను వేధిస్తున్నాయి. వాటికి సమాధానాలు చెప్పేవారు కరువయ్యారు. సచివాలయాలు, పాఠశాల ల్లో సరైన సమాధానం దొరకట్లేదు. కారణం వారికి గురువారం సైతం ఎడిట్‌ ఆప్షన్‌ కా నీ, క్లారిఫై చేసుకునే ఆప్షన్‌కానీ ఇవ్వకపోవటమే. శుక్రవారం సవరణ గడువు కూ డా ముగియనుంది. ఈ నేపథ్యంలో అమ్మఒడి లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లేనన్న వా దనలు వినిపిస్తున్నాయి. సవరణకు గడు వు పొడిగిస్తారన్న వాదనలు వినిపిస్తున్నా యి. పొడిగించకుంటే చాలామంది పథకానికి దూరం కానున్నారు.

ఎక్కడికెళ్లినా తెలీదన్న సమాధానమే

జిల్లావ్యాప్తంగా పిల్లల తల్లులు, సంరక్షకులు మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 7 అంశాలను సాకుగా చూపి అ ర్హుల జాబితా నుంచి విద్యార్థులను తప్పించారు. అమ్మఒడి అనర్హుల జాబితాలో 68, 642 మంది, విత్‌హెల్డ్‌లో 8719 మంది ఉ న్నారు. తమను ఎందుకు అనర్హులుగా ఉం చారో తెలుసుకునేందుకు పాఠశాలల వద్దకెళ్లినా.. గ్రామ, వార్డు సచివాలయాలకెళ్లినా.. సమాధానం మాత్రం దొరకట్లేదు. స చివాలయాల్లో అమ్మఒడి జాబితాలు సైతం డౌన్‌లోడ్‌ కావట్లేదు. పైగా కారణాలు తెలుసుకోవటానికి, ఎడిట్‌ చేయటానికి ఆప్షన్‌ ఇవ్వలేదు. దీంతో సచివాలయ సిబ్బంది అవస్థలుపడుతున్నారు. పాఠశాలల్లో సైతం ప్ర ధానోపాధ్యాయులకు ఆధార్‌, బ్యాంకు వివరాలు మాత్రం మార్చేందుకు అవకాశమిచ్చా రు. దీంతో తమ సమస్యలకు పరిష్కారం తెలుసుకునేందుకు వెళ్లిన తల్లులు, సంరక్షకులకు నిరాశే ఎదురవుతోంది. విద్యాశాఖాధికారులు మాత్రం పాఠశాలలు, సచివాలయాలకు వెళ్లండని సలహా ఇస్తున్నారు. వారు అక్కడికెళ్లినా కారణాలు తెలియట్లేదు. దీంతో అయోమయంలో పడ్డారు. అర్హత ఉన్నా.. పథకానికి దూరం చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :