Friday, December 4, 2020

పంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు



Read also:

పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తైంది. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కర్ణాటక, రాజస్తాన్, బీహార్ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం దృష్టికి న్యాయవాది అశ్వనీకుమార్ తీసుకెళ్లారు. ఎన్నికల నిర్వహణ గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు రాసిన లేఖల వివరాలను కూడా కోర్టుకు లాయర్ అశ్వనీకుమార్ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు అడ్వొకేట్ అశ్వనీకుమార్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ న్యాయవాది వాదన ఇలా.

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తీర్పు అంశాలను ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఎన్నికల కమిషన్, న్యాయవాది చెప్పిన అంశాల్లో కమిషనర్ ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను మాత్రమే అధికారులతో చర్చించారని న్యాయవాది పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పు రిజర్వ్ చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :