Thursday, December 31, 2020

వైఎస్సార్ రైతు భరోసా డబ్బులు ఎందుకు పడలేదు సమస్యలు వాటి కారణాలు



Read also:

1) సమస్య – ప్రజా సాధికార సర్వే లో నమోదు కాక పోవుట-మీరు అర్హత చెక్ చేయగలరు

తీసుకోవాల్సిన చర్య : రేషన్ కార్డ్ ఆధార్ కార్డుతో సంబంధిత రైతు సంబంధిత కార్యాలయమునకు హాజరైన యెడల సమస్య పరిష్కరించబడును

ఎవరిని సంప్రదించాలి : గ్రామ వాలంటీర్ లేదా గ్రామం సహాయకులు లేదా గ్రామ సచివాలయం

ఏ పత్రాలు తీసుకువెళ్లాలి : రేషన్ కార్డు , ఆధార్ కార్డు జిరాక్స్

2) సమస్య : మరణ కేసులు / పోతి కేసులు / నోషనల్ ఖాతాలు

తీసుకోవాల్సిన చర్య : రైతు మీ సేవలో దరఖాస్తు చేసిన తదుపరి తహసిల్దార్ కుటుంబ సభ్యుల ద్రువపత్రము ఇవ్వవలసి ఉన్నది

ఎవరిని సంప్రదించాలి: గ్రామ వాలంటరీ లేదా గ్రామం వ్యవసాయ సహాయకులు

ఏ పత్రాలు జత చేయాలి : ఆధార్ కార్డు జిరాక్స్ , మరణ ధ్రువపత్రం , 1 బి నకలు , కుటుంబ సభ్యుల ధ్రువపత్రం

3) సమస్య : తప్పుగా ఆధార్ సీడింగ్ చేసుకొనుట లేదా ఆధార్ సీడింగ్ చేసుకోనకపోవుట

తీసుకోవాల్సిన చర్య : సంబంధిత రైతు సరైన ఆధార్ నెంబర్ తీసుకొచ్చిన తదుపరి గ్రామ వాలంటీర్ మరియు గ్రామ రెవెన్యూ సెక్రటరీ సంప్రదించవలె

ఎవరిని సంప్రదించాలి : గ్రామ వాలంటీర్ / గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా గ్రామ రెవెన్యూ సెక్రెటరీ

ఏ పత్రాలు జత పరచాలి : ఆధార్ కార్డు జిరాక్స్ , 1 బి నకలు

4) సమస్య : బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవటం

తీసుకోవాల్సిన చర్య : సంబంధిత గ్రామ వాలంటీర్లు రైతులకు విధానం చేసి తెలియజేసి బ్యాంకు వెళ్లినట్లు ప్రోత్సహించుట

ఎవరిని సంప్రదించాలి : గ్రామ వాలంటీర్ మరియు సంబంధిత బ్యాంకు అధికారులు

ఏ పత్రాలు జత పరచాలి : ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంకు పాస్ పుస్తకం

5) సమస్య : ల్యాండ్ లో నమోదై ప్రజా సాధికార సర్వే లో ఉంది ఆధార్తో లింక్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి అనర్హులుగా ప్రకటించబడితే

తీసుకోవలసిన చర్య : రైతు సంబంధిత ధ్రువపత్రములు గ్రామ వాలంటీర్ కు  సమర్పించుట

ఎవరిని సంప్రదించాలి : గ్రామ వాలంటీర్ , గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు

ఏ పత్రాలు జత పరచాలి : ఆధార్ కార్డు జిరాక్స్ , బ్యాంకు ఎకౌంటు జిరాక్స్ , మరియు పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ , మొబైల్ నెంబర్ పత్రములు అన్నీ ఇవ్వాలి

ఈ విధంగా ఎవరికి అయితే రైతు భరోసా పైన తెలిపిన కారణాల వల్ల ఏమైనా డబ్బులు పడకపోతే వెంటనే ఆ సమస్య ను పైన తెలిపిన చర్యలు వెంటనే చేసుకుంటే మీకు రైతు భరోసా డబ్బులు కొన్ని రోజులలోనే మళ్ళీ ప్రబుత్వం ఇలా పెండింగ్ లో ఉన్న రైతులకు డబ్బులు జమ చేసినప్పుడు మీ బ్యాంక్ అకౌంటు లో నే నేరుగా ఈ డబ్బులు పడతాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :