Tuesday, December 22, 2020

అమ్మ వడి ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి



Read also:

అమ్మ వడి ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి

1. Electricity: ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి

  • a) service no.వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no.తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి. 
  • b) service no.వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no.వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి.

2.Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.

3.Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.

4.Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి.

5.Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self-declaration జతచేయాలి.

6.Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land:(విస్తీర్ణము)dry land:(విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు (భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి) తప్ప మరెక్కడా భూములు లేవని self declaration.ఇవన్నీ జతచేయాలి.

అమ్మ వోడి సవరణ దరఖాస్తులు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :