Friday, December 25, 2020

బదిలీల్లో సీఎం జోక్యం చేసుకోవాలి



Read also:

  • బదిలీల్లో సీఎం జోక్యం చేసుకోవాలి
  • రిలే నిరాహార దీక్షలు చేపట్టిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు

ఉపాధ్యాయులపై విద్యాశాఖ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఉపాధ్యాయ బదిలీల్లో తక్షణమే ముఖ్య మంత్రి జోక్యం చేసుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ లక్ష్మణరావు, రాము సూర్యారావు, ఐ వెంకటేశ్వరరావు, స్వతంత్ర ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ డిమాండ్ చేశారు. బదిలీలు ప్రజాస్వామకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం వారు విజయవాడలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఉపాధ్యాయ సంఘాల పట్ల, ఉపాధ్యాయుల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న అధికారులను బదిలీ చేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ చర్చలు జరపలేదని, సంఘాలు చెప్పిన మాటలను లెక్కచేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన సందర్భంలో కూడా సంఘాల నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. బదిలీల విషయంలో ఫ్యాప్టో చైర్మన్, సెక్రటరీ జనరల్ పై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం సరైంది కాదన్నారు. నాడు-నేడు, విద్యాకానుక వంటి పథకాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులు పెరిగారని చెబుతూనే పోస్టుల కోసం ఉపాధ్యాయులు ఇష్టానుసారం విద్యార్థులను చేర్పించారని మాట్లాడటం తగదని వ్యాఖ్యానించారు. దీక్షల్లో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, ఫ్యాప్టో కో చైర్మన్ షేక్ సాబ్లీ, సెక్రటరీ జనరల్ కె. నరహరి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి పి. బాబురెడ్డి ఫ్యాప్టో కో చైర్మన్లు ఎం. రఘునాథరెడ్డి, కె. వెంకటేశ్వరరావు, నాయకులు పి పాండురంగ వరప్రసాద్ పాల్గొన్నారు. దీక్షకు డీవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావు మద్దతు తెలిపి ప్రసంగించారు.

Transfer-23-12-2020 నాటికి వెబ్ options ఇంకను పెట్టని వారి 13 జిల్లాల లిస్ట్

Transfer-23-12-2020 నాటికి వెబ్ options ఇంకను పెట్టని వారి 13 జిల్లాల లిస్ట్

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :