Wednesday, December 16, 2020

అమిత్ షాతో భేటీలో సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలు



Read also:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. పోలవరం అంశం ప్రధానంగా చర్చించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1779 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, అలాగే, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,650 కోట్లకు ఆమోదం తెలపాని అమిత్ షాను జగన్ కోరినట్టు వైసీపీ నేతలు తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు రూ.4300 కోట్లు, 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం రావాల్సిన రూ.1100 కోట్ల నిధులను కూడా వెంటనే రిలీజ్ చేసేలా కేంద్ర ఆర్థిక శాఖకు సూచించాలని ఆయన అమిత్ షాను కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వాడివేడిగా ఉన్న సమయం, దీంతోపాటు ఏపీ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వెళ్తోందంటూ ఇటీవల హస్తిన వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతున్న వేళ జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Meeting

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ‘నేను మోదీ మనిషిగా చెబుతున్నా. అమరావతే రాజధానిగా ఉంటుంది. ’ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం ఏపీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. అలాగే, ఏపీ ప్రభుత్వానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల వివాదం కూడా కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ చెబుతుంటే, కుదరదని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ కూడా దాఖలు చేసింది.

అమిత్ షాతో భేటీలో సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలు

  • పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ.55656 కోట్లను ఆమోదించాలి
  • పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1779 కోట్లు రీయింబర్స్ చేయాలి
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అప్పుడే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుంది
  • సబ్సిడీ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1600 కోట్లు వెంటనే విడుదల చేయాలి.
  • రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు రూ.4308.46 కోట్లు రిలీజ్ చేయాలి
  • స్థానిక సంస్థలకు రావాల్సిన బకాయిలు రూ.1954.5 కోట్లు రిలీజ్ చేయాలి
  • కొత్తగా 16 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలి
  • ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లు, ప్రత్యేక కోర్టుల బిల్లులకు ఆమోదం తెలపాలి

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :