Monday, December 14, 2020

నెలాఖరులోగా ఈపీఎఫ్‌ వడ్డీ జమ



Read also:

నెలాఖరులోగా ఈపీఎఫ్‌ వడ్డీ జమ-8.5 శాతం చొప్పున ఏకమొత్తంగా వేయాలని నిర్ణయం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2019-20 సంవత్సరానికి సంబంధించి ఆరు కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో ఈ నెలాఖరు కల్లా 8.5 శాతం వడ్డీని ఏకమొత్తంగా జమచేయనుంది. వాస్తవానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ అధ్యక్షతన ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి భేటీలో 8.5% వడ్డీని 8.15 శాతం, 0.35 శాతం (రెండు వాయిదాలుగా) విభజించి జమచేయాలని నిర్ణయించారు. తాజాగా పరిస్థితులు కాస్త కుదుట పడడంతో ఒకేసారి చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు 8.5శాతం వడ్డీని జమచేసేందుకు అనుమతించాలని కోరుతూ.. ఈ నెల ప్రారంభంలో కార్మిక మంత్రిత్వశాఖ నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ నుంచి కొద్ది రోజుల్లోనే సమ్మతి లభించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వాస్తవానికి చందాదారులకు 8.5 శాతం వడ్డీ చెల్లించడానికి కొన్ని ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌)లను విక్రయించాలని ఈపీఎఫ్‌వో గతంలో నిర్ణయించింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా మార్కెట్‌లో అస్థిర పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది. ప్రస్తుతం మార్కెట్‌లు ఊహించినదానికన్నా వేగంగా పుంజుకోవడం, బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌లన్నీ గరిష్ఠ స్థాయుల్లో ఉండడంతో 8.5 శాతం వడ్డీ చెల్లించడం పెద్ద సమస్య కాబోదని కొందరు అంటున్నారు.టీచర్స్ ట్రాన్సఫర్స్ కి సంబదించిన పూర్తి సమాచారం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :