Friday, December 25, 2020

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల్లో మార్పులు చేసిన ప్రభుత్వం



Read also:

  • జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల్లో మార్పులు చేసిన ప్రభుత్వం
  • యూనివర్శిటీలు, ప్రభుత్వ పీజీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు మాత్రమే పరిమితం 
  • ప్రైవేట్, అన్ ఎయిడెడ్ కాలేజీలకు వర్తించవు
  • ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలలో మార్పులు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ రెండు పథకాలను కేవలం యూనివర్శిటీలు, ప్రభుత్వ పీజీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ డిగ్రీ, అన్ ఎయిడెడ్ పీజీ కాలేజీలకు ఈ పథకాలు వర్తించవని తెలిపింది. 2020-21 విద్యా సంవత్సరానికి నమోదైన అడ్మిషన్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వెల్లడించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :