Saturday, December 5, 2020

APSSDC Jobs



Read also:

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్, ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. నెల్లూరు జిల్లా సుల్లూరుపేటలోని టెక్స్టైల్ పరిశ్రమలో పని చేసేందుకు అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 85 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. నెల్లూరు జిల్లా సుల్లూరుపేటలోని టెక్స్టైల్ పరిశ్రమలో పని చేసేందుకు అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 85 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టు ఆధారంగా వీరికి రూ. 13 వేల నుంచి రూ. 20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఇతర బెనిఫిట్స్ కూడా అందించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 ఏళ్ల వయస్సు ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

పోస్టులు, ఇతర అర్హతల వివరాలు

మొత్తం నాలుగు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.

Technician-Knitting: ఈ విభాగంలో మొత్తం 28 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ/డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. Knitting repair and maintainance పై నైపుణ్యం తప్పనిసరి. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రెండు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 20 వేల వేతనంతో పాటు అదనపు బెన్ఫిట్స్ కూడా అందిస్తారు.

Operator-Seaming: ఈ విభాగంలో మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 10 వేల వరకు వేతనంతో పాటు అదనపు బెన్ఫిట్లు ఉంటాయి. పురుషులు, స్త్రీలు ఎవరైనా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Operator-Knitting: ఈ విభాగంలో మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. పురుషులు, స్త్రీలు ఎవరైనా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. Operation of CNC/Knitting Machine తదితర స్కిల్స్ తప్పనిసరి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 13 వేల వేతనంతో పాటు ఇతర బెన్ఫిట్స్ అందించనున్నారు.

Electrician: ఈ విభాగంలో మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు నుంచి ఐదేళ్ల వరకు అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో ఐటీఐ చేసిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఈ విభాగంలో ఎంపికైన వారికి రూ. 20 వేల వేతనంతో పాటు ఇతర బెన్ఫిట్స్ ఉంటాయి. దరఖాస్తుదారులు Wireman License Holder అయ్యి ఉండాలి.

Registration-Direct Link

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :