Tuesday, December 8, 2020

AP Teachers Transfers 2020



Read also:

AP Teachers Transfers 2020

  • టీచర్ల సీనియార్టీ జాబితాపై  ముగిసిన అభ్యంతరాల స్వీకరణ  
  • నేడు తుది సీనియార్టీ జాబితా విడుదలకు అధికారుల కసరత్తు 

ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో భాగంగా బదిలీలకు అర్హులైన ఉపాధ్యాయులతో విద్యాశాఖ విడుదల చేసిన సీనియార్టీ జాబితాలపై అభ్యంతరాల స్వీక రణ సోమవారంతో ముగిసింది . బదిలీలకు అర్హులైన ఉపా ధ్యాయుల సీనియార్టీ జాబితా మంగళవారం విడుదల చేయ నున్నారు . కాగా ఆన్లైన్లో ఈ నెల 11 నుంచి 15 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది . జిల్లాలో ప్రభుత్వ , జిల్లా పరిషత్ యాజమాన్యాల వారీగా బదిలీ కోరుతూ ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల నుంచి 5,896 మందితో విడుదల చేసిన సీనియార్టీ జాబితాకు సంబంధించి సోమవారం గడువు ముగిసే సమయానికి 334 విజ్ఞప్తులు వచ్చాయి . సీని యార్టీ జాబితాలో ప్రాధాన్యత క్రమంలో పాయింట్లు , మేనే జీమెంట్ మార్పు , స్పౌజ్ కేటగిరీల వారీగా ఆన్‌లైన్లో పం పిన అభ్యంతరాలను పరిశీలిస్తే ఎక్కువ మంది ఉపాధ్యా యులు ఒకే సమస్యపై పదే , పదే పంపినట్లు తెలుస్తోంది . 60 మంది ఉపాధ్యాయులు ప్రింటవుట్ రూపంలో అభ్యంతరాలను అందజేశారు . అయితే ఆన్లైన్ లో 334 విజ్ఞప్తులు రావ డం , వ్యక్తిగతంగా కేవలం 60 మంది ఉపాధ్యాయులు స్వయంగా వచ్చి అందజేసిన విజ్ఞప్తులపై పరిశీలన జరపడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఒక ఉపాధ్యాయుడు 49 సార్లు మెయిల్

బదిలీకి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు తాము గుర్తిం చి సమస్యపై పదే , పదే పంపిన కారణంగా ఆన్లైన్ లో పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు వచ్చాయి . ఒక ఉపాధ్యాయుడు 49 సార్లు మెయిల్స్ పంపినట్లు అధికారులు గుర్తించారు . వారం రోజులుగా స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించిన అధి కారులు మంగళవారం సీనియార్టీ జాబితా విడుదల చేసేం దుకు కసరత్తు చేస్తున్నారు . ఈవో కార్యాలయ పరిధిలో పరిష్కరించాల్సిన వాటిని ఇక్కడే పరిష్కరించేందుకు నిర్ణ యించిన డీఈవో గంగాభవానీ ప్రాధాన్యత క్రమంలో పాయింట్ల కేటాయింపునకు సంబంధించిన పలు దరఖా స్తులను ఉన్నతాధికారులకు నివేదించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :