Saturday, December 19, 2020

AP Ration cards

Read also:

రేషన్ కార్డు (Ration Cards) రద్దైన వారికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh( ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అర్హతలను మరోసారి నిరూపిస్తే కొత్త కార్డు మంజూరు చేయనుంది.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఇటీవల భారీగా రేషన్ కార్డులను తొలగించింది. వైఎస్ఆర్ నవశకంలో భాగంగా నిర్వహించిన సర్వేలో విచారణ జరిపి కార్డులను రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 8లక్షలకు పైగా కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. కొన్ని చోట్ల చిన్నచిన్న పొరబాట్ల కారణంగా అర్హుల కార్డులు కూడా రద్దయ్యాయి. ఐతే కార్డుల్ని ఎలా పునరుద్ధరించుకోవాలి అనే దానిపై రద్దైన వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై విమర్శలు రావడంతో  అనర్హత పున: పరిశీలనకు మరో అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆయా అంశాల్లో అనర్హత సవాలు చేస్తూ సంబంధింత ధ్రువీకరణ పత్రాల్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయడం ద్వారా కార్డుల్ని పునరుద్ధరించుకోవచ్ఛు.

• ఆదాయ పన్ను చెల్లించకపోయినా చెల్లించినట్లు చూపించి కార్డు రద్దు చేస్తే ఛార్డెడ్‌ అకౌంటెంట్‌(సీఏ) ప్రాక్టీషనర్‌ నుంచి ఫారం-16 తీసుకుని సమర్పిస్తే కార్డు రెన్యువల్ చేస్తారు.

• 300 యూనిట్లకంటే తక్కువ కరెంట్ వినియోగం ఉన్నా ఎక్కువ ఉన్నట్లు చూపించి కార్డు రద్దు చేస్తే విద్యుత్ శాఖ ఏఈ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పిస్తే కార్డు రద్దవ్వదు.

• ఫోర్ వీలర్ లేకపోయినా ఉన్నట్లు గతంలో ఉన్న వివరాల ఆధారంగా కార్డు తొలగిస్తే ఆర్టీవో, బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్ల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పించాలి.

• కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ లేకపోయినా కార్డు తొలగిస్తే ఏ శాఖ ఉద్యోగిగా చూపించారో ఆ శాఖ పర్యవేక్షకాధికారి నుంచి క్లియరెన్స్ లెటర్ తీసుకొని అధికారులకు సమర్పించాలి.

• పదెకరాలకంటే తక్కువ భూమి ఉండి కూడా ఎక్కువగా ఉన్నట్లు చూపించి రద్దు చేస్తే సబంధిత మండల తహసీల్దార్‌ నుంచి 1బీ సర్టిఫికెట్ తీసుకోవాలి.

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి  52లక్షల 70వేల రేషన్ కార్డులుండగా.. వాటిలో 8లక్షల 44వేల కార్డులను వివిధ కారణాల వల్ల ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం కార్డుల సంఖ్య  ఒక కోటి 44లక్షల 26వేలకు తగ్గింది. వీరికి వచ్చే ఏడాది నుంచి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇకపై రైస్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ ఇచ్చిన సమయంలో లబ్ధిదారు మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వలంటీర్లు ట్యాబ్ లో ఎంటర్ చేస్తే సరుకులు డెలివరీ ఇచ్చినట్లు లెక్క. ఇక రేషన్ సరుకుల డోర్ డెలివరీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులకు సబ్సిడీపై ప్రభుత్వం వాహనాలను మంజూరు చేస్తోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :