AP Lands Resurvey: ఏపీలో భూముల రీ సర్వే జగన్ పాదయాత్రలో భూ వివాదాలపై అనేక ఫిర్యాదులు అందాయని.ప్రజలందరికీ మేలు చేసే కార్యక్రమం ఈ భూ సర్వే అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.
భూముల రీ సర్వే చారిత్రాత్మక నిర్ణయమని ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు లో సీఎం జగన్ ఈ కార్యక్రమం ప్రారంభిస్తారని తెలిపారు. 2023 జూలై నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు. భూమి అంశంలో ఏ చిన్న సమస్య ఉండకూడదనే ఈ నిర్ణయమని వెల్లడించారు. జగన్ పాదయాత్రలో భూ వివాదాలపై అనేక ఫిర్యాదులు అందాయని.ప్రజలందరికీ మేలు చేసే కార్యక్రమం ఈ భూ సర్వే అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించినా ప్రైవేట్ సంస్థల వలన అది పూర్తి కాలేదని అన్నారు.
ఈసారి తాము సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. స్థిరాస్తులు అన్ని సర్వే చేస్తామని.. గ్రామ సచివాలయాల్లో ఈ భూ రికార్డ్ లు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి రైతులకు అండగా నిలుస్తామని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. చట్టబద్ధమైన, న్యాయమైన హక్కులు చేకూరుతాయని భావిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఈ అంశం పై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయిని అన్నారు. అత్యాధునిక సాంకేతికతతో సర్వే నిర్వహిస్తామని.ప్రజలతో పాటు, ప్రతిపక్షాలు కూడా ఈ కార్యక్రమానికికు సహకరించాలని కోరుతున్నామని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
ఈ భూముల రీ సర్వే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న ఏపీ సర్కార్.. దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో సర్వే చేస్తున్నామని వెల్లడించింది. 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. 100 ఏళ్లలో సబ్ డివిజన్లు, పంపకాలు క్షేత్రస్థాయిలో నమోదు కాని పరిస్థితి ఉందని.వాటన్నింటినీ రికార్డుల్లోకి ఎక్కిస్తామని అన్నారు. రికార్డులన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేస్తామని.విలేజ్ హాబిటేషన్స్కు సంబంధించిన మ్యాపులు కూడా అందుబాటులోకి తీసుకొస్తారని సీఎం జగన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సర్వే రికార్డులు ఉంటాయని అన్నారు.