Saturday, December 26, 2020

AP IIIT Admission schedule rank wise



Read also:

AP IIIT Admission schedule rank wise

4 నుంచి 11 వరకూ కౌన్సెలింగ్

ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిష న్లకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఇడుపులపాయలో అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో మొత్తం 1,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులు విద్యార్థులకు అందిస్తారు.

అడ్మిషన్ల షెడ్యూల్‌ ఇదీ

ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ జనవరి 4 నుంచి 11వ తేదీ వరకూ జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12గంటలకు రెండు బ్యాచ్‌లకు వేర్వేరుగా కౌన్సెలింగ్‌ జరుగుతుంది.  అడ్మిషన్లకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు జనరల్‌ మెరిట్‌ ర్యాంకు కేటాయించారు.  

🔹మెరిట్‌ ర్యాంకు ప్రకారం ఆల్‌ కేటగిరీ విద్యార్థులు జనవరి 4న ఉదయం 8 గంటలకు 1 నుంచి 200 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 12 గంటలకు 201 నుంచి 400 ర్యాంకు వరకు హాజరుకావాలి.

🔹జవనరి 4న ఉదయం 8 గంటలకు 401 నుంచి 800 వరకు, మధ్యాహ్నం 12 గంటలకు 801 నుంచి 1200 వరకు...  

🔹జవనరి 6న ఉదయం 8 గంటలకు 1,201 నుంచి 1,700  వరకు మధ్యాహ్నం 12 గంటలకు 1701 నుంచి 2000 వరకు..  

🔹జవనరి 7వతేదీ ఉదయం 8గంటలకు 2001 నుంచి 2600 వరకు, మధ్యాహ్నం 12 గంటలకు 2601 నుంచి 3000 వరకు.. 

🔹జవనరి 8న ఉదయం 8గంటలకు 3001 నుంచి 3600వరకు, మధ్యాహ్నం 12గంటలకు 3601 నుంచి 4000 వరకు.  

🔹జవనరి 9న అన్ని బీసీ కేటగిరీలు ఉదయం 8 గంటలకు 5000 ర్యాంకు వరకు మధ్యాహ్నం 12 గంటలకు అన్ని బీసీఏ కేటగిరీ 5,001 నుంచి 7,000 ర్యాంకు వరకూ హాజరుకావాలి.  

🔹జవనరి 10న ఉదయం 8 గంటలకు ఈడబ్య్లూఎస్‌  4001 నుంచి 10వేలు ర్యాంకు వరకు మధ్యాహ్నం 12గంటలకు బీసీ-ిసీ కేటగిరీలు 5001 నుంచి 16వేల ర్యాంకు వరకు, బీసీ-ఈ 5001 నుంచి 11వేలు ర్యాంకు వరకు హాజరుకావాలి.  

🔹జవనరి 11న  ఉదయం 8 గంటలకు ఎస్సీ 4001 నుంచి 12వేల ర్యాంకు వరకు మధ్యాహ్నం 12గంటలకు ఎస్టీ కేటగిరీలు 4001 నుంచి 20వేలు ర్యాంకు వరకు హాజరుకావాలి.

కావాల్సిన సర్టిఫికెట్లు ఇవీ

రిజర్వేషన్‌ కేటగిరీ కింద అడ్మిషన్‌ పొందగోరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను కౌన్సెలింగ్‌ సమయంలో సమర్పించాలి. ఎన్‌సీసీ, స్పోర్ట్సు, పీహెచ్‌. సైనిక ఉద్యోగుల పిల్లలు సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. అడ్మిషన్లు కేవలం మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ విధానంలోనే లభిస్తాయి. అడ్మిషన్లకు ఎంపికైన జనరల్‌ అభ్యర్థులు రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.1,500, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు అయితే కాషన్‌ డిపాజిట్‌గా రూ.1,000, అన్ని వర్గాల అభ్యర్థులు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది.

For More Information about counselling process Check here

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :