Friday, December 11, 2020

Ammavodi info



Read also:

జగనన్న అమ్మ ఒడి పథకం-2020-21కు సంబంధించి విద్యార్థుల తల్లులు తమ వివరాలను  వెబ్‌ పోర్టల్‌లో సరిచూసుకోవాలని పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు సూచించారు. గురువారం ఆయన తన కార్యాలయంలో  ‘అమ్మ ఒడి’ పథకం అమలు తీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పథకం విజయవంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అలాగే, ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకు.. అర్హులైన తల్లులు లేదా సంరక్షకులు తమ బ్యాంకు ఖాతా నంబరు, ఐఎ్‌ఫఎస్సీ కోడ్‌, రైస్‌ కార్డు నంబరు వంటి వివరాలను ‘అమ్మ ఒడి’ వెబ్‌ పోర్టల్‌లో సరిచూసుకోవాలని కోరారు. ఆ వివరాల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ణి సంప్రదించి సరిదిద్దుకోవాలని సూచించారు. ఇంకా అభ్యంతరాలుంటే ‘అమ్మ ఒడి’ వెబ్‌ పోర్టల్‌లో సరిచేసుకోవాలన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :