Wednesday, December 23, 2020

AmmaVodi in January 9



Read also:

జనవరి 9న అమ్మఒడి అందజేస్తాం-విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

ఈ నెల 26లోపు అమ్మ ఒడి లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల్లో అభ్యర్థుల జాబితా పెడతామని, అందులో పేరులేని అర్హులైనవారు మళ్లీ నమోదు చేసుకోవచ్చని అన్నారు. 30న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. జనవరి 9న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మ ఒడి నగదును తల్లుల ఖాతాలో వేస్తామన్నారు.

ప్రయివేటు స్కూల్ విద్యార్థులకు కూడా అమ్మ ఒడిని ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పెద్దమనసుతో ప్రకటించారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రతి స్కూల్‌ యాజమాన్యం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.  అమ్మ ఒడి డబ్బులను ఫీజులకు ముడిపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతేడాది ఫీజు 70శాతం మాత్రమే తీసుకోవాలన్నారు. అమ్మ ఒడి డబ్బును ఫీజులతో ముడి పెట్టటం ఆక్షేపణీయమని, ఇలాంటి పని ఏ స్కూల్‌ యాజమాన్యం చేసినా ఒప్పుకునేది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :