Tuesday, December 22, 2020

Amazon Fab Phones Fest



Read also:

Amazon Fab Phones Fest:ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, యాక్ససరీస్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తుంది. పాపులర్ బ్రాండ్లుగా పేరొందిన ఆపిల్(Apple), శామ్‌సంగ్(Samsung), షియోమి(Xiaomi), వన్ప్లస్ వంటి బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు, ఉపకరణాలపై నో–కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ప్రకటించింది.


ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon) మరో భారీ సేల్‌తో వినియోగదారుల ముందుకొచ్చింది. ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్’(Fab Phones Fest Sale) అనే పేరుతో ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ క్రిస్టమస్ పండుగ (డిసెంబర్ 25) వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, యాక్ససరీస్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తుంది. పాపులర్ బ్రాండ్లుగా పేరొందిన ఆపిల్(Apple), శామ్‌సంగ్(Samsung), షియోమి(Xiaomi), వన్ప్లస్ వంటి బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు, ఉపకరణాలపై నో–కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లతో పాటు హెచ్‌డీఎఫ్‌(HDFC) బ్యాంకుతో చేసే లావాదేవీలపై అడిషనల్ క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.


ఈ సేల్‌లో భాగంగా రెడ్‌మి 9 పవర్ వంటి నూతనంగా విడుదలైన స్మార్ట్‌ఫోన్లు కూడా విక్రయిస్తోంది. ఈ ఏడాదిలో నిర్వహిస్తున్న చివరి సేల్‌గా దీన్ని అమెజాన్ పేర్కొంది. కాగా, ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ (Fab Phones Fest Sale) సందర్భంగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి కనిష్టంగా రూ .10,000 వరకు నేరుగా లేదా ఈఎంఐ ద్వారా చేసే లావాదేవీలపై 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదేవిధంగా శామ్సంగ్, వన్‌ప్లస్, షియోమి, ఆపిల్, ఒప్పో, నోకియా, హానర్తో పాటు మరిన్ని బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై 12 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ, అడిషనల్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఇవే కాకుండా, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో చేసే లావాదేవిలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్స్‌టెంట్ డిస్కౌంట్

అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఈ సేల్ ఆఫర్లను ముందుగానే పొందవచ్చు. దీనితో పాటు వారు బుకింగ్ చేసుకున్న వస్తువులకు ఉచిత డెలివరీని సదుపాయం కూడా లభిస్తుంది. సేల్లో భాగంగా శామ్‌సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ ఎడిషన్, గెలాక్సీ M31 (6 జిబి + 128 జిబి), గెలాక్సీ M21 వంటి స్మార్ట్‌ఫోన్‌లు వరుసగా రూ .16,499, రూ .19,499, రూ .13,999 వద్ద లభిస్తాయి. కాగా, శామ్సంగ్ గెలాక్సీ M51, శామ్సంగ్ గెలాక్సీ M31 (6 బిజి + 128 జిబి) కొనుగోలుపై ప్రైమ్ మెంబర్స్ ప్రత్యేకంగా రూ .1000 విలువైన అమెజాన్ కూపన్లను కూడా పొందవచ్చు. అంతేకాక, వన్‌ప్లస్ కస్టమర్లు వన్‌ప్లస్ 7T సిరీస్‌లోని ఫోన్ల కొనుగోలుపై రూ .10,000 వరకు డిస్కౌంట్ను పొందవచ్చు. అదేవిధంగా, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో వన్‌ప్లస్ 8 సిరీస్‌లో ఏ ఫోన్‌ను కొనుగోలు చేసిన ఫ్లాట్ 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

కాగా, వన్‌ప్లస్ 8 (6 జీబీ + 128 జీబీ) ప్రస్తుతం రూ .39,999 కు లభిస్తుండగా, ప్రో మోడల్ (12 జీబీ + 256 జీబీ) మాత్రం రూ .59,999 వద్ద అమ్ముడవుతోంది. ఈ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్లో ఆపిల్ ఐఫోన్ 11, ఐఫోన్ 7 కొనుగోలుపై ఆకర్షనీయమైన డీల్స్‌ను పొందవచ్చు. ఈ రెండు ఫోన్లు వరుసగా రూ.51,999, రూ. 23,990 ధర తగ్గింపుతో లభిస్తాయి. అదేవిధంగా వినియోగదారులు ఎంచుకున్న అన్ని రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌లపై రూ .3,500 వరకు డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొంది. కాగా, Redmi Note 9 (4 జిబి + 64) రూ .10,999కు, Redmi Note 9 Pro Max (4 జిబి + 64) రూ .15,999 వద్ద అమ్ముడవుతోంది. ప్రీమియం ధరలో లభించే Mi 10T సిరీస్ స్మార్ట్‌ఫోన్లు డిస్కౌంట్‌లో భాగంగా రూ .33,999లకే లభిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :