Sunday, December 27, 2020

ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు 31 వరకూ గడువు



Read also:

ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు 31 వరకూ గడువు కాకినాడ సిటీ: శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అర్హులైన ఉపాధ్యా యులు, అధ్యాపకులు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల ఒకటో తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించామని, ఈ నెల 31 లోగా క్లెయిమ్ లు, అభ్యంతరాల దాఖలుకు గడువు ఇచ్చామని పేర్కొ న్నారు. వీటిని జనవరి 12 నాటికి పరిష్కరించి అనుబంధాలు ముద్రిస్తామన్నారు. తుది జాబి తాను జనవరి 18న ప్రచురిస్తామని తెలిపారు అర్హులైన ఉపాధ్యాయులు, లెక్చరర్లు సంబంధిత తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాల యాల్లో ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకో వచ్చని వివరించారు. ఆన్లైన్ లో కూడా ఫారం - 19లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం టోల్ ఫ్రీ నం బర్ 1950లో సంప్రదించాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి సూచించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :