3 ఆప్షన్లను ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
1. నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వమే సరఫరా చేసి, లేబర్ ఛార్జీలు కూడా
లబ్దిదారుల చేతికే అందించటం ప్రభుత్వం ఇచ్చిన ఇంటి నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన, నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేసి, లేబర్ ఛార్జీలు కూడా లబ్ధిదారుల చేతికే అందిస్తుంది. వాటితో లబ్దిదారులే ఇళ్ళు నిర్మింపజేసుకోవచ్చు.
2. లబ్దిదారులే స్వయంగా అవసరమైన సామాగ్రిని కొని తెచ్చుకోవటం.. దానికైన
నగదును ప్రభుత్వం నుండి దశల వారీగా పొందటం ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని లబ్దిదారులు ప్రభుత్వంతో అవసరం లేకుండా స్వయంగా కొని తెచ్చుకుంటాము అంటే దానికి కూడా నగదుని లబ్దిదారులకే ప్రభుత్వం అందిస్తుంది. మీరే ఇళ్ళు కూడా నిర్మించుకోవచ్చు అని చెప్పారు. అయితే ఈ ఆప్షన్'ని ఎంచుకున్న లబ్దిదారులకు నగదును దశల వారీగా మాత్రమే అందిస్తారు.
3. మొత్తం ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వటం ప్రభుత్వం ఇచ్చిన ఇంటి సమూనా ప్రకారం లబ్ధిదారులు కోరుకుంటే అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ మొత్తం ఇల్లు ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది.
ఈ 3 అప్పన్స్ లో లబ్దిదారులు తమకు నచ్చిన అప్పన్ ఎంచుకోవచ్చు అని, లబ్దిదారుల | ఎంపిక ప్రకారమే ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుంది అని ముఖ్యమంత్రిగారు అన్నారు.
ఈ పథకానికి సంబంధించి ఏదైనా సహాయం కావాలన్నా, ఏదైనా ఫిర్యాదులు చేయాలన్న 1902 నెంబర్ కు కాల్ చేయవచ్చు.