Saturday, December 19, 2020

నేడు మూడో విడత ‘వైఎస్సార్‌ రైతు భరోసా



Read also:

వైఎస్సార్‌ రైతు భరోసా మూడో విడత అమలుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో ఈ వ్యవసాయ సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ 29న రాష్ట్రంలో 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,009 కోట్లు నేరుగా జమ చేస్తారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తం 50.47 లక్షల మంది రైతులకు రూ.1,009 కోట్లు చెల్లించనుంది. ఇదివరకే వైఎస్సార్‌ రైతు భరోసా కింద రెండు విడతల్లో ఒక్కో రైతు ఖాతాలో రూ.11,500 చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, కీలక నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. సమావేశ వివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు.

Note:ఇలా ప్రతి రోజు  GOVERNMNENT SCHEMES ఎప్పటికప్పుడు  మన టెలిగ్రామ్ లో మీకు అందించడం జరుగుతుంది మీరు ఈ విధంగా ఇవన్నీ  సింపుల్ గా పొందాలి అనుకుంటే  ఇంకెందుకు మరి ఆలస్యం చేయకుండా మన టెలిగ్రామ్ గ్రూప్ లో  పైన ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరుysr_rythu_bharosa_status


Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :