Saturday, December 19, 2020

ఉపాధ్యాయ బదిలీలు - 2020 - నూతన మార్గదర్శకాలు



Read also:

1. ఉపాధ్యా యులు Web Option పెట్టుకొనుటకు గడువు తేది 18-12-2020 తో ముగిసినది. 

2. అన్ని Web Option పెట్టిన ఉపాద్యా యులు తమ Web Option e print నందు సంతకము చేసి సదరు మండల విద్యాశాఖాధికారులకు తేది.19-12-2020లోగా సమర్పించవలెను. 

3. ఆ విధముగా సమర్పించిన Web Option వివరములను సదరు మండల విద్యాశాఖాధికారులు తమ login నందు 21-12-2020 నుండి confirm చేయవలెను. దీనికి గాను విద్యాశాఖాధికారులకు login మరియు password లను పంపించబడును.

4. ఉపాధ్యాయులు ఇంతవరకు ఎవరైనా web option పెట్టనటువంటి వారు సదరు మండల విద్యాశాఖాధికారుల కార్యాలయము నందు తేది.21-12-2020 నుండి 22-12-2020 లోగా హాజరై వారి యొక్క web option లను నమోదు చేసుకొని Web Option print నందు సంతకము చేసి సదరు మండల విద్యాశాఖాధికారులకు సమర్పించవలెను. ఆ విధముగా సమర్పించిన Web Option వివరములను సదరు మండల విద్యాశాఖాధికారులు వెంటనే తమ login నందు confirm చేయవలెను. 

5. ఉపాధ్యాయులు ఎవరైతే తమ web option లను సరిగా నమోదు కాలేదు అని భావించిన వారు లేది.23-12 2020 నుండి 31-12-2020 వరకు సదరు మండల విద్యాశాఖాధికారుల కార్యాలయము నందు MEO గారి సూచనల ప్రకారము హాజరై web option లను పెట్టుకొని Web Option print నందు సంతకము చేసి సదరు మండల విద్యాశాఖాధికారులకు సమర్పించవలెను. ఆ విధముగా సమర్పించిన web Option వివరములను సదరు మండల విద్యాశాఖాధికారులు వెంటనే తమ login నందు confirm చేయవలెను. 

6. ఉపాధ్యాయులు తమ యొక్క web option లను నమోదు | మార్పు చేయునపుడు వారి యొక్క రిజిస్టర్ మొబైల్ నకు OTP వచ్చును. కావున సదరు రిజిస్టర్ మొబైల్ ను తమ వద్ద అందుబాటులో ఉంచుకొనవలెను. 

7. మండల విద్యాశాఖాధికారులు అందరూ ఒక రోజుకు 10 మందిని మాత్రమే తమ కార్యాలయము నందు weboption నమోదు చేయుటకు అనుమతించవలెను.

8. అలా అనుమతించిన ఉపాధ్యాయులకు MRC నందు హాజరైన దినమును OD గా నమోదు చేయవలెను. 

9. మండల విధ్యాశాఖాధికారులు అందరూ ఖచ్చితముగా తమకు కేటాయించిన login మరియు password లను MRC సిబ్బందికి తప్ప ఇతరులకు చెప్పరాదు. 

10. పై ప్రక్రియ మొత్తము కూడా MRC కార్యాలయము నందు మాత్రమే జరుగవలెను. మరి ఎక్కడా కూడా జరుగరాదు.

11. జిల్లా లోని ఉప విద్యాశాఖాధికారులు అందరూ తమ పరిధిలోని ఉపాద్యాయులందరకు పై విషయము తెలియచేసి సదరు మండల విధ్యాశాఖాధికారుల కార్యాలయము సందు web ఆపన్ ల ప్రక్రియ సకాలములో పూర్తి అగునట్లు చర్యలు తీసుకొనవలెను,.

12. పై కార్యక్రమమును సజావుగా నిర్వహించుటకు మండల పరిధిలోని సమర్గు లైన ఉపాధ్యాయులను లేక CRP లను MRC నందు వినియోగించుకొనవచ్చును. MRC నందు హాజరైన దినములకు వారికి OD గా నమోదు చేయవలెను. 

13. ఉపాధ్యాయులు సమర్పించినటువంటి web option print లను పుస్తక రూపములో తయారు చేసి జిల్లా కార్యాలయమునకు సమర్పించ వలెను.

14. పై కార్యక్రమమును తగు జాగ్రత్తలు తీసుకొని 31-12-2020 లోగా పూర్తి చేసి జిల్లా విద్యాశాఖాధికారి గారికి సహకరించవలసినదిగా కోరడమైనది.

ఈ కార్యక్రమము వలన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమమునకు ఎలాంటి అంతరాయము కలుగ రాదు.

AP Transfers new guildelines

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :