Saturday, December 12, 2020

1,86,000 thousand scholarship chance for girls



Read also:

1,86,000 thousand scholarship chance for girls

అమ్మాయిలకు డిఆర్డిఓ గుడ్ న్యూస్ తెలిపింది.డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అమ్మాయిలకు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా 1,86,000వేల వరకు స్కాలర్ షిప్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కాలర్ షిప్స్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30న ముగిసింది. కరోన వైరస్ కారణంగా అప్లై చేయలేని వారికి మరో అవకాశం ఇచ్చింది డిఆర్డిఓ. దరఖాస్తు గడువును 2020 నవంబర్ 15 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అర్హత కలిగిన విద్యార్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సూచించింది.

ఈ పథకం ద్వారా డిఆర్డిఓ 20 అండర్ గ్రాడ్యుయేట్,10 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్స్ అందిస్తోంది. ప్రతిభ ఉన్న విద్యార్థినిలు ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థిక సమస్యలు అడ్డంకిగా మారితే ఈ స్కాలర్ షిప్స్ స్కీమ్ కు దరఖాస్తు చేయవచ్చు అయితే ఈ స్కాలర్ షిప్స్ స్కీమ్ కేవలం భారత దేశానికి చెందిన అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది.వారు మాత్రమే దరఖాస్తు చేయాలి.

ఏరోస్పేస్ ఇంజనీరింగ్,ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ ఏవియానిక్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చదువుతున్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు.


డిగ్రీ స్కాలర్ షిప్స్ పొందడానికి బీఈ, బీటెక్,బీఎస్సీ, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ లో కనీసం 60 శాతం మార్కులు స్కోరు ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. వారికి ఏటా లక్ష ఇరవై వేలు వరకు నాలుగేళ్ల స్కాలర్ షిప్ లభిస్తుంది స్కాలర్ షిప్ కోసం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలి. వారికి 1,86,000 రెండేళ్లు వరకు స్కాలర్ షిప్ లభిస్తుంది. 2020- 21 విద్యా సంవత్సరం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో అడ్మిషన్ పొందిన వారే స్కాలర్ షిప్ అప్లై చేయడానికి అర్హులుగా డిఆర్డిఓ ప్రకటించింది.

ఈ స్కాలర్ షిప్ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను డిఆర్డిఓ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచింది అర్హులైన అభ్యర్థులు https://drdo.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. అనంతరం విద్యార్థినిలు రిక్రూట్మెంట్ అండ్ సెంటర్-RAC వెబ్ సైట్ https://rac.gov.in/ లో అప్లై చేయాలి.

దరఖాస్తు వెబ్సైట్:

విద్యార్థినిలు డిఆర్డిఓ అధికారిక వెబ్ సైట్ లో https://drdo.gov.in/ స్కాలర్షిప్ స్కీమ్లో వివరాలను తెలుసుకోవచ్చు రిక్రూట్మెంట్ అండ్ సెంటర్-RAC వెబ్ సైట్ లో https://rac.gov.in/ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :