Tuesday, November 24, 2020

Your PF money is paid central government



Read also:

కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలనే లక్ష్యంతో మోదీ సర్కా్ర్ వీటిని ఆవిష్కరించింది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్‌ను కూడా తీసుకువచ్చింది.

దేశంలో ఉపాధి పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్ చేసింది. 2020 అక్టోబర్ 1 నుంచి 2021 జూన్ 30 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ కింద కేంద్ర ప్రభుత్వమే ఉద్యోగుల పీఎఫ్ డబ్బులను చెల్లిస్తుంది. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు.

కంపెనీలు కొత్తగా ఎవరినైనా ఉద్యోగంలోకి తీసుకుంటే.. వారి తరుపున కేంద్ర ప్రభుత్వమే పీఎఫ్ డబ్బులు కడుతుంది. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. ఉద్యోగి పీఎఫ్ సబ్‌స్క్రైబర్ అయ్యి ఉండకూడదు. అలాగే మార్చి 1 నుంచి సెప్టెంబర్ 31 మధ్యలో ఉద్యోగం కోల్పోయిన వారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది.

ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వమే 24 శాతం పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను చెల్లిస్తుంది. ఇందులో ఉద్యోగి వాటా 12 శాతం, కంపెనీ వాటా 12 శాతం. రెండేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం ఈవిధంగా పీఎఫ్ డబ్బులు కడుతూ వస్తుంది. 1000కి లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలకు కేంద్రం 24 శాతం పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను చెల్లిస్తుంది. అదే 1000కి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలో జాబ్ వస్తే.. కేంద్రం ఉద్యోగి 12 శాతం వాటాను మాత్రమే చెల్లిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :