Monday, November 30, 2020

web counsilling demo



Read also:

రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ప్రారంభ మైన నేపథ్యంలో ఆన్ లైన్ లో కౌన్సెలింగ్ డెమోను సోమవారం నిర్వహించనున్నా రు. ఈ నెల 28న ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనతో ప్రారంభించి 27 రోజుల్లో బదిలీ ల ప్రక్రియను పూర్తి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీర భద్రుడు గతంలోనే షెడ్యూల్ విడుదల చేశారు. బదిలీల అంశంపై ఉపాధ్యాయ సంఘాలు చేసిన అనేకానేక విజ్ఞప్తులను పరిశీలించి షెడ్యూల్ ప్రకటించారు. అందులో భాగంగా 28, 29 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన నిర్వహించారు. అయితే కౌన్సెలింగ్ కు సంబంధించి ఉపాధ్యాయుల్లో ఉన్న సందేహాల నివృత్తి కోసం వెబెక్స్ ద్వారా సోమవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు డెమోను నిర్వ హించనున్నట్లు జాయింట్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు.

ఐటీసెల్ సహకారంతో నిర్వహించే డెమోలో అన్ని ఉపాధ్యాయ సంఘాలను భాగస్వాములను చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం 30వ తేదీ నుంచి డిసెంబర్ రెండో తేదీ వరకు పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శించనున్నారు. అనంతరం 3,4 తేదీల్లో అభ్యంతరాలు నమోదు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. 5,7 తేదీల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. 8 నుంచి పదో తేదీ వరకు పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శిస్తారు. 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆపన్స్ నమోదుకు అవకాశం కల్పించి, 16 నుంచి 21వ తేదీ వరకు బదిలీల ఆర్డర్లను ప్రదర్శించనున్నారు. బదిలీల ఆర్డర్ లో సాంకేతిక సమస్యల స్వీకరణ, పరిష్కారం తేదీల్లో చేపట్టనున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత డిసెంబర్ 24వ తేదీ నుంచి బదిలీల ఆర్డర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :