Saturday, November 14, 2020

Solar System



Read also:

గ్రహాల కక్ష్యలను లోతుగా అధ్యయనం చేస్తే ఈ కొత్త గ్రహం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు

అంతరిక్షం గురించి, అంతరిక్ష రహస్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన సౌర వ్యవస్థలో మొత్తం తొమ్మిది గ్రహాలు మాత్రమే ఉన్నాయనే విషయాన్ని చిన్నతనం నుంచి పుస్తకాల్లో చదువుకుంటూనే ఉన్నాం. కాగా, ప్లూటో గ్రహం కనుగొనక ముందు 8 గ్రహాలు మాత్రమే ఉండేవని తెలిసిందే. అయితే, సౌర వ్యవస్థలో శని, బృహస్పతి గ్రహాల మధ్య మరో గ్రహం కూడా ఉండే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న గ్రహాలకు అదనంగా ఉందని భావిస్తున్న దీన్ని పదో గ్రహంగా పేర్కొంటున్నారు. అయితే, ఈ గ్రహం బహుశా ఇతర గ్రహాల నుంచి విచ్ఛిన్నం కాకుండానే ఏర్పండిందని, దాని కక్ష్య నుండి తరిమివేయబడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గ్రహాల కక్ష్యలను లోతుగా అధ్యయనం చేస్తే ఈ కొత్త గ్రహం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, పదో గ్రహం మంచుతో కప్పబడి ఉండటం వల్ల కనిపించకపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రహ వ్యవస్థ ఎలా ఉద్భవించిందో తెలుసుకోవడానికి అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో వేలాది నమూనాలను రూపొందించి పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధనలో భాగంగా బృహస్పతి, శని గ్రహాలు ఓవల్ కక్ష్యలతో ప్రారంభమైనట్లు శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. ఇది గతంలో మనం నమ్మినదానికంటే చాలా భిన్నమైన విశ్లేషనగా పేర్కొనవచ్చు.

శని, బృహస్పతి గ్రహాల మధ్య మరో గ్రహం?

యురేనస్, నెప్ట్యూన్ వంటి మంచు గ్రహాల విషయానికి వస్తే ఈ రెండింటి మధ్య ఉనికిలో ఉన్న మరొక మంచు గ్రహం ఉండవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రెండు గ్రహాల కక్ష్యలను వీటి మధ్య ఉన్న గ్రహం గురుత్వాకర్షణతో లాగేస్తుందని వారు నమ్ముతున్నారు. అయితే, ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనపై రచయిత మాట్ క్లెమెంట్ మాట్లాడుతూ, పాలపుంత గెలాక్సీలో వేలాది గ్రహ వ్యవస్థలు ఉన్న విధంగానే మన సౌర వ్యవస్థలోనూ అనేక గ్రహాల అమరిక ఉండవచ్చని ఆయన పేర్కొన్నాడు. క్లెమెంట్ పేర్కొన్న దాని ప్రకారం, శాస్త్రవేత్తల బృందం 6,000 అనుకరణలను నిర్వహించగా, ఎక్కువ దృష్టి శని, బృహస్పతి గ్రహాల మధ్య సంబంధాలపై పెట్టింది.

కాగా, ఐకార్స్ జర్నల్లో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురించబడ్డాయి. ఈ అధ్యయనం నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు తమ కక్ష్య నుంచి బయటికి రావడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు. దీనికి కైపర్ బెల్ట్ గురుత్వాకర్షణ పుల్ వంటి కొన్ని బాహ్య కారకాలు ప్రధాన కారణమై ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ప్లూటో, ప్లానెటోయిడ్స్, ఇతర మరగుజ్జు గ్రహాలు మంచుతో నిండిన రింగ్‌లో ఉండవచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా, మన సౌర వ్యవస్థలో భాగమైన శని, బృహస్పతి గ్రహాల మధ్య నుండి బయటకు నెట్టివేయబడిన మరో పెద్ద గ్రహం ఉండే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :