Tuesday, November 24, 2020

schools after sankranthi



Read also:

  • సిలబస్ మరింత కుదింపు
  • 1 నుంచి 5 తరగతులు సంక్రాంతి అయ్యాకే
  • 6 నుంచి 7తరగతులు డిసెంబర్ 14నుంచి
  • శీతాకాలం దృష్ట్యా పాఠశాలలపనివేళల్లో మార్పులు

రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదోతరగతి పాఠశాలలు సంక్రాంతి తర్వాతే తెరుచుకోను న్నాయి. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా సుదీర్ఘ విరామం తర్వాత నెల రెండో తేదీ నుంచి 9, 10 తరగతులు ప్రారంభమైన ఈ విషయం తెలిసిందే. ఈ నెల 23 (సోమవారం) నుంచి 6, 7, 8 తరగతులను ప్రారంభిస్తామనిఇదివరకే ప్రకటించినప్పటికీ.. కరోనా కేసులు తగ్గకపోవడంతో 8వ తరగతికి మాత్రమే క్లాసులు ప్రారంభమయ్యాయి. 6, 7 తరగతులను డిసెంబర్ 14 నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్య దర్శి బి. రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అలాగే కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అమలు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటా 45 నిమిషాల వరకు ఉన్న పనివేళలను ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటా 30 నిమిషాలకు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నవంబర్ రెండో తేదీన 9, 10 తరగతులు ప్రారంభించిన సమయంలోనే 23 నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభిస్తామని ప్రక టించిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్ కేసులు తగ్గకపోవడంతో ఎనిమిదో తరగతి మాత్రమే ప్రారంభించి, 6, 7 తరగతుల ప్రారంభాన్ని డిసెంబర్ 14కు వాయిదా వేశారు. ఆ తేదీ నుంచి ప్రారంభించాల్సిన ఒకటి నుంచి ఐదు తరగతులను సంక్రాంతి పండుగ తర్వాతకు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సిలబస్ మరింత కుదింపు

1నుంచి 7 తరగతుల ప్రారంభం మరింత ఆలస్యం అవుతుండటంతో ఆ మేరకు సిలబస్ లోనూ మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటికే కొవిడ్ కారణంగా సగం పనిదినాల్లో కోత పడటంతో 35 శాతం వరకు సిలబస్ ను తగ్గించి పాఠ్య పుస్తకాలను సిద్ధం చేశారు. అయితే మరిన్ని పనిదినాలు తగ్గే పరిస్థితుల్లో సిలబస్ లో మార్పులు చేయాలని ఎస్ సీఈ ఆర్ టీ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :