Friday, November 20, 2020

SBI Apprentice Recruitment 2020



Read also:

SBI Apprentice Recruitment 2020

డిగ్రీ పాసయ్యారా? డిగ్రీ అర్హతతో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాల జాతరకు తెరతీసింది. ఏకంగా 8500 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. దేశంలోని వేర్వేరు జోన్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. వీరిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులుగా గుర్తించరు. ఎంపికైనవారికి మూడేళ్లు ట్రైనింగ్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇప్పటికే డిగ్రీ అర్హతతో 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 డిసెంబర్ 4 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఇప్పుడు 8500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్‌బీఐ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 10 చివరి తేదీ. 2021 జనవరిలో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 8500

తెలంగాణ- 460 (ఆదిలాబాద్ -10, భద్రాద్రి కొత్తగూడెం -21, జగిత్యాల -9, జనగాం -10, జయశంకర్ -12, జోగులంబా -9, కామారెడ్డి -16, కరీంనగర్ - 14, ఖమ్మం - 24, కొమరంభీమ్ -7, మహాబూబాబాద్ -12, మహబూబ్‌నగర్ -33, మల్కాజ్‌గిరి -5, మంచిర్యాల -8, మెదక్ -14, నాగర్‌కూర్నూల్ -15, నల్గొండ -22, నిర్మల్ -11,

నిజామాబాద్ -39, పెద్దపల్లి -10, రంగారెడ్డి -22, సంగారెడ్డి -20, సిద్దిపేట -17, సిరిసిల్ల -6, సూర్యపేట -28, వికారాబాద్ -23, వనపర్తి -12, వరంగల్ -4, వరంగల్ రూరల్-11, యాదాద్రి భువనగిరి -16)ఆంధ్రప్రదేశ్- 620 (శ్రీకాకళం- 33, విజయనగరం- 29, విశాఖపట్నం- 44, తూర్పుగోదావరి- 62, పశ్చిమ గోదావరి- 75, కృష్ణా- 53, గుంటూరు- 75, ప్రకాశం- 47, నెల్లూరు- 37, చిత్తూరు- 43, కడప- 51, అనంతపూర్- 28, కర్నూలు- 43)

గుజరాత్- 482

కర్నాటక- 600

మధ్యప్రదేశ్- 430

చత్తీస్‌గఢ్- 90

పశ్చిమ బెంగాల్- 480

ఒడిశా- 400

హిమాచల్ ప్రదేశ్- 130

హర్యానా- 162

పంజాబ్- 260

తమిళనాడు- 470

పాండిచ్చెరి- 6

ఢిల్లీ- 7

ఉత్తరాఖండ్- 269

రాజస్తాన్- 720

కేరళ- 141

ఉత్తర ప్రదేశ్- 1206

మహారాష్ట్ర- 644

అరుణాచల్ ప్రదేశ్- 25

అస్సాం- 90

మణిపూర్- 12

మేఘాలయ- 40

మిజోరం- 18

నాగాలాండ్- 35

త్రిపుర- 30

బీహార్- 475

జార్ఖండ్- 200

SBI Apprentice Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

నోటిఫికేషన్ విడుదల- 2020 నవంబర్ 20

దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 20

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 10

దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 10

ఆన్‌లైన్ ఫీజు పీమెంట్- 2020 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10

దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 25

SBI Apprentice Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

విద్యార్హతలు- 2020 అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు.

వయస్సు- 2020 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష.

స్టైపెండ్- మొదటి ఏడాది నెలకు రూ.15,000. రెండో ఏడాది నెలకు రూ.16,500. మూడో ఏడాది నెలకు రూ.19,000. ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ ఉండవు.

Source::News18

ఎస్‌బీఐ అప్రెంటీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్‌బీఐ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :