Friday, November 27, 2020

Pending salaries



Read also:

Green Signal to pending salaries

పెండింగు జీతాల చెల్లింపునకు ప్రభుత్వ నిర్ణయం-మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం మంత్రి కన్నబాబు వెల్లడి.

Pending salaries

కరోనా కారణంగా పెండింగులో ఉంచిన జీతాలు చెల్లించేందుకు రాష్ర్ట మంత్రి మండలి నిర్ణయించింది.  ఉద్యోగులు, పెన్షనర్లు, వివిధ క్యాడర్లలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా  మార్చి, ఏప్రిల్ నెలల్లో కోత విధించారు. ఉద్యోగులకు సగం మేర కోత విధించారు. నాలుగో తరగతి  ఉద్యోగులకు, ఇతరులకు వేర్వేరు మొత్తాల్లో కోత విధించారు.  పెన్షనర్లకు మార్చి నెల పింఛను లో సగం కోత విధంచారు. ప్రస్తుతం  ఈ పెండింగు  మొత్తాలను డి సెంబర్ , జనవరి నెలల్లో  రెండు విడతల్లో చెల్లించేందుకు రాష్ర్ట మంత్రి మండలి శుక్రవారం  ఆమోదించింది. రాష్ర్ట వ్యవసాయశాఖ  మంత్రి కురసాల కన్నబాబు  విలేకరుల సమావేశంలో ఈ  విషయం వెల్లడించారు. ఉద్యోగుల జీతాలు రూ. 2,324 కోట్లు, పెన్షన్లు రూ.880.50 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :