Saturday, November 14, 2020

Pending DA



Read also:

పెండింగ్ డీఏ, కోత విధించిన జీతాల చెల్లింపునకు ఆదేశాలు

ఉద్యోగులు, పెన్షనర్లకు నవంబరు జీతంతో పాటు ఏప్రిల్, మేలో నిలిపివేసిన 50 శాతం జీతం మొదటి విడత చెల్లింపు జరుగుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆమోదం పొందగానే పెన్షనర్ల డీఏ జీవో కూడా విడుదలవుతుందని పేర్కొన్నారు. ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ వైవీ రావుతో పాటు ఫణి పేర్రాజు తదితరులు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏ చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ ను నిర్ణయిస్తూ జీవో ఇచ్చినప్పటికీ, పెన్షనర్లకు మాత్రం ఇవ్వని విషయాన్ని ప్రస్తావించారు. తక్షణం స్పందించిన సజ్జల.. ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడి ఈ నెల జీతంతో పాటే మొదటి విడత చెల్లింప చేయాలని కోరారు. ఆ తర్వాత సచివాలయంలోని ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణను జేఏసీ నేతల బృందం కలిసింది. పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ డీఏ కూడా రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రి ఆమోదం పొందగానే విడుదల చేస్తామని ఆయన చెప్పారు ఉద్యోగుల పెండింగ్ డీఏ, 50 శాతం కోత విధించిన వేతనాలను చెల్లించటానికి ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు బొప్పరాజు, వైవీ రావు ధన్యవాదాలు తెలిపారు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :