Friday, November 13, 2020

One Nation-One Ration Card



Read also:

One Nation-One Ration Card:28 రాష్ట్రాల్లో వన్ నేషన్- వన్ రేషన్ కార్డ్.. ఇకపై ఎక్కడైనా రేషన్

దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమల్లోకి వచ్చిందని కేంద్రఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. సెప్టెంబరు 1 నుంచి 68.8 కోట్ల మందిని నేషనల్ పోర్లబిలిటీ కిందకు తీసుకొచ్చామని వెల్లడించారు.

'వన్ నేషన్ వన్ రేషన్ కార్డు' దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇకపైదేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమల్లోకి వచ్చిందని కేంద్రఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. సెప్టెంబరు 1 నుంచి 68.8 కోట్ల మందిని నేషనల్ పోర్లబిలిటీ కిందకు తీసుకొచ్చామని వెల్లడించారు. వీరిందరికి ఎంతో లబ్ధి చేకూరుతోందని ఆమె అన్నారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా నెలకు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమల్లోకి వచ్చిన రాష్ట్రాలు:

ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిమ్, మిజోరాం, తెలంగాణ, కేరళ, పంజాబ్, త్రిపుర, గోవా, హిమాచల్ ప్రదేశ్, దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్.

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే

లాక్‌డౌన్‌లో వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చేతిలో పనిలేక, తినడానికి తిండి లేక అల్లాడిపోయారు. వందల కిలోమీటర్లు నడిచి వెళ్లారు. అలాంటి వారి కోసం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు తీసుకొచ్చింది కేంద్రం. ఇకపై వలస కార్మికులు పని కోసం ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడ రేషన్ సరుకులు తీసుకోవచ్చు. దగ్గరలో ఉన్న పీడీఎస్ షాప్ లేదా చౌక ధరల దుకాణానికి వెళ్లి రేషన్ కొనుగోలు చేయవచ్చు.

Nishtha 1-5 Modules portfolio status check

Ap Teachers Transfer certificate forms and Applying process

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :