Tuesday, November 10, 2020

Older Android Phones



Read also:

2016కు ముందు మీ ఫోన్ కొన్నారా? ఇలా మీరు పాత ఆండ్రాయిడ్ ఫోన్ (old android phone) వినియోగదారులైతే మీకో బ్యాడ్ న్యూస్. మీ ఆండ్రాయిడ్ ఫోన్ కొని మూడేళ్ల దాటితే మాత్రం కొత్త ఏడాదిలో (new year) మీరు కొత్త ఫోన్ (new phone) కొనక తప్పదు.

2016కు ముందు మీ ఫోన్ కొన్నారా? ఇలా మీరు పాత ఆండ్రాయిడ్ ఫోన్ (old android phone) వినియోగదారులైతే మీకో బ్యాడ్ న్యూస్. మీ ఆండ్రాయిడ్ ఫోన్ కొని మూడేళ్ల దాటితే మాత్రం కొత్త ఏడాదిలో (new year) మీరు కొత్త ఫోన్ (new phone) కొనక తప్పదు. కొత్త సంవత్సరంలో మీ పాత ఫోన్ అప్ గ్రేడ్ (upgrade) చేసుకోక తప్పదు. 7.1.1 నౌగట్ (nougat) వంటి వర్షన్స్ లో ఉన్న పాత ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చే ఏడాది నుంచి సపోర్ట్ చేయదని ఆండ్రాయిడ్ పోలీస్ బ్లాగ్ (android police blog) స్పష్టంచేసింది. కాబట్టి మీ పాత ఫోన్లలలో మీరు సెక్యూర్డ్ వెబ్ సైట్లను (secured websites) ఓపన్ చేసి, వాటిని చదవలేరు. మీ పాత ఆండ్రాయిడ్ డివైజులు (android devices) ఏవైనా ఇక కొత్త ఏడాదిలో పనిచేయవు. మీరు మీ పాత డివైజులను తీసేసి సరికొత్త వర్షన్స్ (new version) కు షిఫ్ట్ అవ్వాల్సిందే. డేటెడ్ ఆపరేటింగ్ సిస్టం (dated operating system) ఆధారంగా పనిచేసే ఆండ్రాయిడ్ డివైజెస్ తో వెబ్ సైట్లు తెరచుకోవు. కేవలం ఫైర్ ఫాక్స్ (Firefox) ను డౌన్ లోడ్ చేసుకుని మాత్రమే వెబ్ సైట్స్ ను యాక్సెస్ చేయవచ్చు.

లెట్స్ ఎన్ క్రిప్ట్ (lets encrypt)

లెట్స్ ఎన్ క్రిప్ట్-ఐడెన్ ట్రస్ట్ కంపెనీల మధ్య ఒప్పందం 2021 సెప్టంబరు 1న ముగియనుంది. అయితే ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడం లేదు కనుక పాత ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త తిప్పలు మొదలవ్వనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం వెబ్ డొమైన్లు లెట్స్ ఎన్ క్రిప్ట్ తో ఒప్పందాలు చేసుకున్నాయి. పలు వెబ్ బ్రౌజర్లు, ఆపరేటింగ్ సిస్టంల వెబ్ సైట్లకు ట్రస్ట్ సర్టిఫికెట్లు అందించడంలో లెట్స్ ఎన్ క్రిప్ట్ సంస్థ అగ్రగామిగా ఉంది. దీంతో లెట్స్ ఎన్ క్రిప్ట్ ట్రస్ట్ సర్టిఫికెట్ లేని బ్రౌజర్లు, ఆపరేటింగ్ సిస్టంలలో సెక్యూర్ వెబ్ సైట్లు పనిచేయవన్నమాట. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ వర్షన్ అంతకన్నా ముందు మార్కెట్లోకి వచ్చిన వర్షన్లకు లెట్స్ ఎన్ క్రిప్ట్ సర్టిఫికెట్ లేదు. దీంతో ఇలాంటి వర్షన్ల ఆధారంగా పనిచేస్తున్న ఫోన్లలో సెక్యూర్ వెబ్ సైట్లు ఓపెన్ కావు.

33.8% ఫోన్లు పనిచేయవు

లెట్స్ ఎన్ క్రిప్ట్ రిపోర్ట్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 33.8శాతం పోన్లు ఈ పాత వర్షన్ల ఆధారంగానే పనిచేస్తున్నాయ. కాబట్టి ఈ పాత ఆపరేటింగ్ సిస్టంలు వాటిని వెంటనే అప్ గ్రేడ్ చేసుకోక తప్పదు. ఇవేవీ వచ్చే ఏడాది సెప్టంబరు నుంచి పనిచేయవన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే 2016 కన్నా ముందు కొన్న ఆండ్రాయిడ్ ఫోన్లతో కొన్ని వెబ్ సైట్లకు యాక్సెస్ ఉండదని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనికి విరుగుడుగా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఫైర్ ఫాక్స్ లో అన్ని వెబ్ సైట్లూ యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. లేటెస్ట్ ఫైర్ ఫాక్స్ ఎడిషన్ డౌన్ లోడ్ చేసుకుని మీరు అన్ని సెక్యూర్డ్ వెబ్ సైట్లు ఓపన్ చేయవచ్చు. ఇటీవలే ఆండ్రాయిడ్ 11 (android 11 ready ) డెవలపర్ ప్రివ్యూగా విడుదలైంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఆండ్రాయిడ్ 11 ఫైనల్ వర్షన్ భలే ఆకర్షణీయంగా ఉంది. వినూత్న ఫీచర్లు, సెట్టింగ్స్ ఎన్నో సదుపాయాలతో నెట్ సేవీలను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :