Thursday, November 12, 2020

Nirmala Sitharaman speech highlights



Read also:

వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ మంచి ఫలితాలనిస్తోందని నిర్మల తెలిపారు. 28 రాష్ట్రాల్లు, యూటీల్లో పేదలు రేషన్ ద్వారా 68.8 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు.

కరోనా లాక్‌డౌన్ తర్వాత కేంద్ర ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌తో భారత ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం సాధిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. రైతులు, వీధి వ్యాపారులు, మత్స్యకారులకు పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేశామని వెల్లడించారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా 68.8 కోట్ల మందికి లబ్ధి చేకూరుదోందని తెలిపారు. వలస కార్మికుల వివరాలకు సంబంధించిన పోర్టల్ అభివృద్ధి దశలో ఉందని చెప్పారు నిర్మల సీతారామన్.

నిర్మల సీతారామన్ ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు:

వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ మంచి ఫలితాలనిస్తోంది. 28 రాష్ట్రాల్లు, యూటీల్లో పేదలు వన్ నేషన్ వన్  రేషన్ ద్వారా 68.8 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా నెలకు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి.

పీఎం స్వనిధి పథకానికి 26.62 లక్షల మంది వీధి వ్యాపారులు దరఖాస్తులు చేసుకున్నారు. 13.78 లక్షల మందికి రుణాలు మంజూరు అయ్యాయి. అందుకోసం రూ.1373.33 కోట్ల నిధులను విడుదల చేశాం.

వలస కార్మికుల వివరాలను తెలిపే పోర్టల్‌ అభివృద్ధి దశలో ఉంది. అది అందుబాటులోకి వస్తే వలస కార్మికులు ఎక్కడికి పోతున్నారు? ఏం పనిచేస్తున్నారన్న పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.

కిసాన్ క్రెడిట్ కార్డుల వల్ల 2.5 కోట్ల మందికి లబ్ధి చేకూరింది.1.83 కోట్ల దరఖాస్తులు రాగా. 1.57 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను బ్యాంకులు మంజూరు చేశాయి. వాటి ద్వారా రెండు దశల్లో 1,34,262 కోట్లు మంజరయ్యాయి.

రైతులకు నాబార్డు ద్వారా అడిషనల్ ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ కింద 25 వేల కోట్లను మంజూరు చేశాం. మత్ససంపద యోజన పథకం కింద 21 రాష్ట్రాల్లోని మత్స్యకారుకు రూ.1681 కోట్ల నిధులు మంజూరు చేశాం.ఇక పాక్షిక క్రెడిట్ గ్యారటీ స్కీమ్ 2.0 కింద రూ.26,889 కోట్లు, NBFC/HFCలకు స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ కింద రూ.7227 కోట్లు, DISCOMSకి 1,18,273 నిధులను మంజూరు చేశారు. ఇప్పటికే 11 రాష్ట్రాలు, యూటీలకు రూ.31,136 కోట్లు చేరాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :