Thursday, November 5, 2020

news today



Read also:

ఎక్కువ కరోనా కేసులు వస్తే సెలవులు -టీచర్ల హాజరూ నిర్భంధం కాదు -డీఈవో వివరణ

♦టీచర్ల హాజరూ నిర్భంధం కాదు

♦డీఈవో సీవీ రేణుక వివరణ

జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు, టీచర్లకు కరోనా పాజిటివ్ రావడంపై తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని డీఇవో సీవీ రేణుక అన్నారు. పాఠశాలల్లో కరోనా కలకలం పై మీడియాలో వస్తున్న ప్రచారంపై బుధవారం రాత్రి వివరణ ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొవిడ్ టెస్టు నిర్వహి స్తున్నామని, ఈ క్రమంలో అక్టోబర్ 26 నుంచి 28వ తేదీ మధ్య వివిధ పాఠశాలల్లో చేసిన కరోనా వీఆర్డీఎల్ టెస్టు ల ఫలితాలు బుధవారం వచ్చాయని వివరించారు. ఈ ఫలితాల్లో కొందరికి పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు పాజిటివ్ కేసులు నమోదైన పాఠశాలలను శానిటైజ్ చేయిస్తామని, ఎక్కువ కేసులు నమోదైన పాఠశాలలకు కొన్ని రోజులపాటు సెలవులు ప్రకటిస్తామన్నారు. జలుబు దగ్గు వంటి కరోనా లక్షణాలున్న టీచర్లు, కొన్ని రోజుల పాటు సెలవులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తు న్నట్టు చెప్పారు. వీరు పాఠశాల విధులకు నిర్బంధ హాజ రు ఏమీ లేదని, ఆ మేరకు ఏపీ టెల్స్ యాప్ లో సెలవు కోరుతూ మినహాయింపు పొందవచ్చునన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :