Friday, November 27, 2020

Mushrooms benfits



Read also:

పుట్ట గొడుగులను తినడం ద్వారా ఐదు ఆరోగ్య ప్రయోజనాలుఅవేంటో తెలుసుకోండి

పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇవి ప్రాణాంతకమైన క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం.. అన్ని రకాల పుట్టగొడుగుల్లో తక్కువ కేలరీలు మరియు కొవ్వు ఉంటుంది. ఇవి కాకుండా, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ డి, రాగి, పొటాషియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు వంటి ఇతర పోషకాలు కూడా పుట్టగొడుగుల్లో ఉంటాయి. పుట్టగొడుగులను తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ఐదు రకాల ప్రయోజనాలు ఇవే.

పుట్టగొడుగులతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పుట్ట గొడుగులను తింటే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల భారిన పడే ప్రమాదం తగ్గుతుంది. పుట్టగొడుగులు తినడం వలన ఉబకాయం, బరువు పెరగడం లాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

పుట్టగొడుగులు రక్తపోటు,ఇతర గుండె సంబంధిత వ్యాధులను రాకుండా మనలను కాపాడుతాయి. కాపున పట్టగొడుగులు తినడం గుండెకు మంచిది.

పుట్టగొడుగులోని రెండు ప్రధాన యాంటీ ఆక్సిడెంట్లు - ఎర్గోథైరాన్ మరియు గ్లూటాతియోన్ మెదడు కణాలను రక్షిస్తాయి. పుట్టగొడుగుల వినియోగం గుర్తుంచుకునే శక్తిని పెంచుతుంది.

పుట్టగొడుగులలో ఉండే విటమిన్ డి, కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. మీ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చడం ద్వారా ఎముకల వ్యాధులు, ఎముక నొప్పి తదితర వ్యాధులను నివారించవచ్చు.

పుట్ట గొడుగులను తినడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :