Saturday, November 28, 2020

Modi Hyderabad Tour



Read also:

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ (Bharat biotech) కంపెనీ కొవాక్జిన్ (Covaxin), అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ క్యాడిల్లా కంపెనీ జైకోవ్-డీ (ZyCoV-D) వాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి.

 భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ క్యాంపస్‌ను ఆయన సందర్శించారు. 45 నిమిషాల పాటు శాస్త్రవేత్తలతో సమావేశమై. కొవాగ్జిన్ (Covaxin) వాక్సిన్ అభివృద్ధి గురించి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వాక్సిన్ అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలకు ఆయన అభినందించారు. అనంతరం వాక్సిన్ పురోగతిని ప్రధాని మోదీకి శాస్త్రవేత్తలు వివరించారు. భారత్ బయోటెక్ క్యాంపస్ సందర్శన అనంతరం. బయటకు వచ్చి మీడియా ప్రతినిధులు, ప్రజలకు అభివాదం తెలిపారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో నేరుగా హకీంపేట ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు ప్రధాని మోదీ వెళ్లారు. హకీంపేటలో విమానం ఎక్కి. పుణెకు బయలుదేరి వెళ్లారు.

మన దేశంలో మూడు వాక్సిన్‌లు ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ (Bharat biotech) కంపెనీ కొవాక్జిన్ (Covaxin), అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ క్యాడిల్లా కంపెనీ జైకోవ్-డీ (ZyCoV-D) వాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇక పుణెకు చెందిన సీరస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకొని. భారత్‌లో కోవిషీల్డ్ (covishield) వాక్సిన్‌ను తయారు చేస్తోంది.

ఐతే ఈ మూడు సంస్థల్లో వ్యాక్సిన్ పురోగతిని ప్రధాని మోదీ స్వయంగా సమీక్షిస్తున్నారు. మొదట అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిల్లా సెంటర్‌ని సందర్శించిన ఆయన. మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చి భారత్ బయోటెక్ క్యాంపస్‌ను సందర్శించారు. అనంతరం పుణెకు వెళ్లి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శిస్తారు. ఇక రష్యా తయారుచేసిన స్పుత్నిక్-v వాక్సిన్ ఇప్పటికే భారత్ చేరింది. రష్యా వాక్సిన్‌ను తయారుచేసేందుకు హెటిరో సంస్థ ఒప్పందం చేసుకుంది. ఐతే ప్రధాని మోదీ మాత్రం. మేకిన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ నినాదం మేరకు. స్వదేశీ వాక్సిన్ కొవాగ్జిన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు మన దేశంలో తయారవుతన్న వాక్సిన్‌లలో కొవాగ్జినే ముందంజలో ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :