Tuesday, November 17, 2020

KGBV Transfers



Read also:

KGBV Transfers-కేజీబీవీ సిబ్బందికీ బదిలీలు - బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ ఇలా కేజీబీవీ సిబ్బందికీ బదిలీలు

కేజీబీవీల్లో పనిచేసే స్పెషల్ ఆఫీసర్లు,

సీఆర్టీ, పీఈటీ, పీజీటీలకు బదిలీలు నిర్వహించాలని పాఠశాల విద్యాకమిషనర్ చిన వీరభద్రుడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 1వ తేదీ నాటికి ఒకే ప్రాంతంలో రెండేళ్లు పూర్తి చేసిన వారు బదిలీకి అర్హులుగా పరిగణించబడతారు.

స్పెషల్ కేటగిరి, ప్రిఫరెన్షియల్ కేటగిరి వారికి ప్రత్యేక పాయింట్లు కేటాయించారు. కాగా,బదిలీలకు సంబంధించిన విశేషమైన అధికారాలు జిల్లా స్థాయి కమిటీకి ఉంటాయి. కలెక్టర్ నామినీ చైర్మన్‌గా వ్యవహరించే కమిటీలో కన్వీనర్‌గా ఏపీసీ, సభ్యులుగా డీఈఓ, డైట్ ప్రిన్సిపల్ ఉంటారు.

బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ ఇలా

  • ఈ నెల 26 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • డిసెంబర్ 2న దరఖాస్తుల పరిశీలన
  • డిసెంబర్ 4న రీ ప్లేస్ మెంట్ ఆర్డర్స్
  • డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు అంతర జిల్లా దరఖాస్తుల పరిశీలన
  • డిసెంబర్ 8న సీనియార్టీ జాబితా ప్రదర్శన
  • డిసెంబర్ 10న అభ్యంతరాల స్వీకరణ
  • డిసెంబర్ 12న తుది సీనియార్టీ జాబితా ప్రదర్శన
  • డిసెంబర్ 14 నుంచి 17 వరకు బదిలీల కౌన్సెలింగ్
  • డిసెంబర్ 19న జాయినింగ్ రిపోర్ట్

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :