More ...

Monday, November 30, 2020

Key changes in ITR‌ formsRead also:

గత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2 ఫారాల్లో ఆదాయం పన్ను (ఐటీ) శాఖ పలు కీలక మార్పులను చేసింది. కాబట్టి 2020-21 మదింపు సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఈ మార్పులను గుర్తుంచుకోండి

ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) 1 నుంచి 7 వరకు కొత్త ఆదాయం పన్ను రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫారాలను ప్రకటించింది. ట్యాక్స్‌పేయర్‌ వర్గాన్నిబట్టి, అతను సంపాదించే ఆదాయం, దాని స్వభావం, స్వరూపం ఆధారంగా ఐటీఆర్‌-1 నుంచి ఐటీఆర్‌-7 వరకున్న ఫారాలను ఎంచుకోవచ్చు. వ్యక్తిగత ట్యాక్స్‌పేయర్లు తమ ఐటీ రిటర్నులను ఈ డిసెంబర్‌ 31కల్లా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 30దాకే ఉన్న గడువును మరో నెల రోజులు కేంద్రం పొడిగించింది

  • ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్‌ ఖాతాల్లో కోటి రూపాయలకుపైగా డిపాజిట్‌ చేసినవారు, తన లేదా ఇతరుల విదేశీ ప్రయాణాల కోసం రూ.2 లక్షలకుపైగా ఖర్చు చేసినవారు, వార్షిక విద్యుత్‌ వినియోగ బిల్లులు లక్ష రూపాయలు దాటినవారు ఐటీ రిటర్నులు దాఖలు చేయాలి.
  • ఐటీఆర్‌-1, 2లోని వివిధ షెడ్యూళ్లలో పాన్‌కు బదులుగా ఆధార్‌ను వినియోగించుకునే అవకాశం కల్పించారు.
  • సెక్షన్‌ 80సీ, 80డీ, 80జీ కింద వివిధ పెట్టుబడులకు వర్తించే పన్ను మినహాయింపు కాలపరిమితిని కరోనా దృష్ట్యా ఐటీ శాఖ పొడిగించింది. కొత్తగా 'షెడ్యూల్‌ డీఐ'ని పరిచయం చేశారు.
  • ఆరోగ్య బీమా, ముందస్తు హెల్త్‌ చెక్‌-అప్‌, వైద్య ఖర్చుల క్లెయిముల కోసం షెడ్యూల్‌ 80డీకి మార్పులు
  • ఐటీ రిఫండ్ల కోసం బహుళ బ్యాంక్‌ ఖాతాలను ఎంచుకోవచ్చు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :