Saturday, November 21, 2020

ITR Filing



Read also:

మీరు ఐటీ రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదా? మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసే ముందు ముఖ్యమైన తేదీల వివరాలు తెలుసుకోండి.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొద్ది రోజుల క్రితమే శుభవార్తను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ఐటిఆర్) దాఖలు చేయడానికి మరోసారి గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన విధంగా ఇన్కమ్ టాక్స్ రిటర్న్ దాఖలుకు నవంబర్ 30 వరకు మాత్రమే గడువు ఉండగా, కరోనా వైరస్ దృష్ట్యా దాన్ని ఇప్పుడు మరో నెల రోజుల పాటు పొడిగించింది. పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరు ఇకనైనా ఆలస్యం చేయకుండా డిసెంబర్ 31లోపు దాఖలు చేయాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడగించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలా డెడ్లైన్ పలుమార్లు పొడిగించింది. దేశంలో కరోనా వైరస్ విజృంభన కారణంగా పన్ను మదింపుదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది తుది గడువును పొడిగించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా ప్రతి ఏడాది మార్చి 31 వరకు మాత్రమే ఇన్కమ్ టాక్స్ రిటర్న్ దాఖలుకు గడువు ఉండేది. అయితే, ఈ ఏడాది కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. కాగా, పన్ను ముదింపుదారులు 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 మధ్య సంపాదించిన ఆదాయాన్ని ఈ ఏడాది ఐటీఆర్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా సాధ్యమైనంత తొందరగా దాఖలు చేయండని పన్ను చెల్లింపుదారులను కోరింది ఆర్థిక మంత్రిత్వ శాఖ.

ఐటిఆర్ దాఖలు చేయడానికి ముఖ్య తేదీలు

కరోనా మహమ్మారి కారణంగా ఆదాయపు పన్ను రిటర్ను దాఖలులో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా చెల్లింపుదారులకు మరింత సమయం ఇవ్వడానికి గడువు తేదీలను పొడిగించినట్లు ఆదాయపు పన్ను శాఖ పరిధిలోని అగ్ర విధాన రూపకల్పన సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) తెలిపింది. పన్ను చెల్లింపుదారుల కోసం తాజాగా తేదీలను సవరించింది. వాటిని పరిశీలించండి.

1. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన పన్ను చెల్లింపుదారులు తమ ఐటిఆర్‌ దాఖలు చేయడానికి 2020 జనవరి 31 వరకు అవకాశం ఇచ్చింది.

2. పన్ను ఆడిట్ నివేదిక చట్టం క్రింద చేసే అంతర్జాతీయ/ దేశీయ లావాదేవీలకు సంబంధించి వివిధ ఆడిట్ నివేదికలను అందించే చివరి తేదీని 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించింది.

3. చిన్న పన్ను చెల్లింపుదారులు అనగా లక్ష రూపాయల వరకు సెల్ఫ్ అసెస్మెంట్ కింద పన్ను చెల్లించే వారి విషయంలో ఐటీఆర్ దాఖలు గడువును 2021 జనవరి 31 వరకు పొడిగించింది. కాగా, కరోనా వైరస్ విజృంభన దృష్ట్యా చిన్న, మధ్యతరగతి చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేందుకు, సెల్ఫ్ అసెస్మెంట్ కింద లక్ష రూపాయల వరకు చెల్లించే వారికి గతంలో ఉన్న చివరి గడువును జూన్ నుండి నవంబర్ 30కి మార్చింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :