Sunday, November 29, 2020

How to apply duplicate pan card



Read also:

PAN Card | మీ పాన్ కార్డు పోయిందా? ఎక్కడ పారేసుకున్నారో గుర్తు రావట్లేదా? మీ పాన్ కార్డు దొరకట్లేదా? ఆన్‌‌లైన్‌లో డూప్లికేట్ పాన్ కార్డు తీసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

1. పాన్ కార్డు. బ్యాంకు లావాదేవీల నుంచి ఆర్థిక వ్యవహారాల వరకు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. పాన్ కార్డును ఐడీ కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. 

2. మరి పాన్ కార్డు ఎక్కడైనా పోగొట్టుకుంటే ఏం చేయాలి? కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. ఆన్‌లైన్‌లోనే డూప్లికేట్ కార్డుకు అప్లై చేయొచ్చు. మరి డూప్లికేట్ పాన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

3. ముందుగా https://www.tin-nsdl.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో Services ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అందులో PAN ఆప్షన్ ఎంచుకోండి. Reprint of PAN Card పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

4. అందులో మీ పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. మీ పాన్ కార్డు వివరాలు అప్‌డేట్‌ చేసి పాన్ కార్డ్ రీ ప్రింట్‌కు దరఖాస్తు చేయొచ్చు. మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. 

5. పాన్ అప్లికేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలన్న ఆప్షన్ ఎంచుకోవాలి. ఇ-కేవైసీ, ఇ-సైన్ డిజిటల్‌గా సబ్మిట్ చేయాలి. ఇ-సైన్ ద్వారా స్కాన్ చేసిన ఇమేజెస్‌ని సబ్మిట్ చేయాలి. పేమెంట్ పూర్తి చేసిన తర్వాత డూప్లికేట్ పాన్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :