Friday, November 6, 2020

health-tip Don't eat at night time



Read also:

  • మన రోజూ తీసుకునే ఆహారంలో కొన్నింటిని రాత్రి పూట తీసుకోకూడదనే విషయం మనలో చాలామందికి తెలియదు.
  • మన తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం ఎలా ఉండాలనే అంశాన్ని నిర్ణయిస్తుంది. అందుకే డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే మన రోజూ తీసుకునే ఆహారంలో కొన్నింటిని రాత్రి పూట తీసుకోకూడదనే విషయం మనలో చాలామందికి తెలియదు. అలాంటి ఆహార పదార్థాలేంటో తెలుసుకుని.. వాటికి దూరంగా ఉండాలి.
  • చాలామందికి రాత్రి పూట ఐస్‌క్రీమ్ ఒక సరదా. కానీ అది మంచిది కాదు. అందులో ఉండే అధిక చక్కెర శాతం నిద్రని దూరం చేస్తుంది. అధిక చక్కెర, జీర్ణం అవడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. దానివల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.
  • ఆల్కహాల్ తీసుకునే వారిలో చాలామంది రాత్రి పూటే ఆ పని చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల మరుసటి రోజు తీవ్ర అలసత్వంతో బాధపడాల్సి ఉంటుంది. ఆల్కహాల్ సేవించి తొందరగా నిద్రపోదామనుకునే ఆలోచనలో మరుసటి రోజు అలసత్వం గురించి మర్చిపోతారు.
  • మాంసం జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. రాత్రిపూట మాంసం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మీద భారం పడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు వస్తాయి
  • కాఫీలో ఉండే కెఫైన్ బ్లడ్ ప్రజర్‌ని ఎక్కువ చేసి ఉత్తేజాన్ని ఇస్తుంది. దీని కారణంగా నిద్ర తొందరగా రాదు. అది మీ తర్వాతి రోజుపై ప్రభావం చూపుతుంది. 
  • టమాట ఉదయం పూట తీసుకోవడం ఎంత మంచిదో రాత్రిపూత దానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. దానిలో ఉండే అధిక శాతం విటమిన్ సి జీర్ణం కావడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది
  • పొద్దునపూట వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల నిద్ర దూరం అవుతుంది. తొందరగా జీర్ణం కాని ఆహారపదార్థాలు నిద్రని పాడుచేస్తాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :