Google Account | మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్త. మరో 7 నెలల్లో మీ జీమెయిల్ అకౌంట్ క్లోజ్ కావచ్చు. ఎందుకో తెలుసుకోండి.
1. గూగుల్ ఇటీవల కొత్త పాలసీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కన్స్యూమర్ అకౌంట్ల విషయంలో అనేక మార్పులు చేయబోతోంది. అకౌంట్ ఇనాక్టీవ్లో అంటే వాడకుండా ఉంటే ఆ అకౌంట్‌ను క్లోజ్ చేయాలని గూగుల్ నిర్ణయించింది. 2021 జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.
2. ఈ గడువుకన్నా రెండేళ్ల ముందు నుంచి యాక్టీవ్‌లో లేని అకౌంట్లను గూగుల్ డిలిట్ చేయనుంది. అంటే గత రెండేళ్లుగా మీరు గూగుల్ అకౌంట్ ఉపయోగించనట్టైతే ఆ అకౌంట్ డిలిట్ కానుంది. అంతేకాదు... జీమెయిల్, గూగుల్ డ్రైవ్‌లో స్టోరేజ్ లిమిట్ దాటిన అకౌంట్లను కూడా గూగుల్ తొలగించనుంది.
3. గూగుల్ షీట్స్, డాక్స్, స్లైడ్స్, డ్రా డ్రాయింగ్స్, ఫామ్స్, జామ్బోర్డ్ ఫైల్స్, ఫోటోల్ లాంటి అకౌంట్లకు కూడా ఇది వర్తిస్తుంది. అంటే జీమెయిల్ మాత్రమే కాదు గూగుల్ డ్రైవ్, ఫోటోస్ లాంటి ప్రొడక్ట్స్‌ని మీరు రెండేళ్లుగా ఉపయోగించనట్టైతే ఆ అకౌంట్ డిలిట్ అవుతుంది.
4. యాక్టీవ్‌లో లేని అకౌంట్ల గురించి, స్టోరేజ్ లిమిట్ ఎక్కువగా వాడుతున్న అకౌంట్ హోల్డర్లను అనేకసార్లు అప్రమత్తం చేసింది గూగుల్. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. 2021 జూన్ 1 నుంచి యాక్టీవ్‌లో లేని అకౌంట్లను డిలిట్ చేసే ప్రక్రియ మొదలుపెట్టనుంది.
5. ఒకవేళ మీరు మీ గూగుల్ అకౌంట్‌ను చాలాకాలంగా వాడనట్టైతే మీ అకౌంట్ డిలిట్ అయ్యే అవకాశముంది. అందుకే మీ అకౌంట్ డిలిట్ కావద్దంటే అప్పుడప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉండాలి. మీ జీమెయిల్, గూగుల్ డ్రైవ్, ఫోటోస్ ప్లాట్‌ఫామ్‌ను మీ మొబైల్లో వెబ్సైట్లో ఓపెన్ చేయాలి
6. ఇక ఎక్కువ స్టోరేజ్ ఉపయోగిస్తున్నవారి కోసం గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ అందిస్తోంది గూగుల్. ప్రతీ అకౌంట్‌కు 15 జీబీ స్టోరేజ్‌ను ఉచితంగా ఇస్తుంది గూగుల్. అంతకన్నా ఎక్కువ స్టోరేజ్ వాడటానికి అవకాశం ఉండదు. ఎక్కువ స్టోరేజ్ వాడుకోవాలంటే గూగుల్ వన్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి.
7. ఫోటోస్ ప్లాట్ఫామ్లోకి అప్లోడ్ చేసే ఫోటోల విషయంలో కూడా 2021 జూన్ 1 నుంచి మార్పులు రానున్నాయి. ఇప్పటివరకైతే ఒకవేళ హై క్వాలిటీతో ఫోటోలు అప్లోడ్ చేస్తే ఉచితం. ఒరిజినల్ క్వాలిటీ ఫోటోలను అప్లోడ్ చేస్తే గూగుల్ ఇచ్చే స్టోరేజ్ స్పేస్‌లో కౌంట్ అవుతుంది.
8. కానీ 2021 జూన్ 1 నుంచి ఏ క్వాలిటీతో అప్లోడ్ చేసినా 15జీబీ డిఫాల్ట్ స్టోరేజ్లోకే వెళ్తుంది. ఫ్రీగా అప్లోడ్ చేసే అవకాశం ఉండదు. అయితే 2021 జూన్ 1 కన్నా ముందు అప్లోడ్ చేసిన ఫోటోలకు ఈ రూల్ వర్తించదు. జూన్ 1 తర్వాత అప్లోడ్ చేయబోయే ప్రతీ ఫోటో ఇక 15జీబీ స్టోరేజ్‌లోనే ఉంటుంది.
9. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ ఫోటోస్ ఉపయోగించేవారందరికీ ఇది వర్తిస్తుంది. గూగుల్ ఫోటోస్‌లోకి మీరు అప్లోడ్ చేసే ఫోటోలు, వీడియోలు డిఫాల్ట్ స్టోరేజ్లోకే వెళ్తాయి. 15జీబీ వరకు ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ స్టోరేజ్ వాడుకోవాలంటే గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి.
10. గూగుల్ ఫోటోస్‌లో మీ ఫోటోలు, వీడియోలు మేనేజ్ చేయడానికి, డిలిట్ చేయడానికి కొత్త టూల్‌ను అందించబోతోంది గూగుల్. డార్క్, బ్లర్ ఫోటోస్, లార్జ్ వీడియోస్‌ను ఈ టూల్ గుర్తించి యూజర్లకు సూచిస్తుంది. వాటిని యూజర్లు డిలిట్ చేయొచ్చు. 2021 జూన్ నాటికి ఈ టూల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.