Thursday, November 19, 2020

మీ Gmail పాస్వర్డ్ మర్చిపోయారా? ఈ విధంగా తిరిగి పొదవచ్చు.



Read also:

ఆన్లైన్ లో పార్టీ అవసరానికి ఉపయోగపడే ఇమెయిల్ ఐడి గా Gmail ఒకసారైనా ఖచ్చితంగా అవసరమవుతుంది. అలాగే , చాలా అవసరాలకు Gmail ఐడి ఉపయోగపడువుతుంది. కాబట్టి, ఇంత ముఖ్యమైన ఈ Gmail పాస్ వర్డ్ ను మరచిపోవడం సమస్యగా ఉంటుంది. మీరు మీ Gmail పాస్ వర్డ్ ను మరచిపోతే, మీరు దాన్ని క్రింది స్టెప్స్ ద్వారా చాలా సులభంగా తిరిగి పొందగలుగుతారు. దీని గురించి పూర్తిగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ...

ఆఫీస్ పనులకే కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలోని అవసరాలకు కూడా అన్ని విషయాలకు ఇది ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా, Google యొక్క మరే ఇతర సర్వీస్ అయినా ఉపయోగించలనుకుంటే, మీకు ఇదే Gmail ఖాతా అవసరం అవుతుంది. మరొక విషయం, మీరు Android ఫోన్ ను ఉపయోగిస్తే, ఈ ఖాతా తప్పనిసరి.
మీరు మీ Gmail పాస్ వర్డ్ ను మరచిపోతే ఎలా కోలుకోవాలి?

Step 1 - మొదట మీ Google Account లేదా Gmail పేజీని తెరవండి.
Step 2 - ఇప్పుడు గూగుల్ లాగిన్ పేజీలోని 'Forget Password' ఎంపిక పై క్లిక్ చేయండి.
Step 3 - మీకు గుర్తుంకువున్న చివరి పాస్ వర్డ్ ను నమోదు చేయండి. మీకు పాస్ వర్డ్ గుర్తులేకపోతే, 'మరో మార్గం ప్రయత్నించండి' (Try another way) ఎంచుకోండి.
Step 4 - మీ Gmail ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్ కు గూగుల్ ఒక మెసేజ్ పంపుతుంది.
Step 5 - మీకు ఫోన్ నంబర్ లేకపోతే, Google మీ ఇమెయిల్ కు ఒక వెరిఫికేషన్ కోడ్ను పంపుతుంది. మీకు ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేకపోతే, 'Try another way' ఎంచుకోండి.
Step 6 - ఇక్కడ మీకు ఇమెయిల్ పంపగల మరొక ఇమెయిల్ ఐడి ని గూగుల్ అడుగుతుంది.
Step 7 - ఇప్పుడు మీరు గూగుల్ నుండి ఇమెయిల్ వచ్చినప్పుడు గూగుల్ డైలాగ్ బాక్స్ పేజీని తెరవండి.
Step 8 - రికవర్ అయిన తర్వాత, క్రొత్త పాస్ వర్డ్ ఉపయోగించి మీ Gmail కి లాగిన్ అవ్వండి.
గమనిక: పాస్ వర్డ్ ను చీటికిమాటికి మార్చవద్దు మరియు దానిని వ్రాసుకోండి. మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లోకి లాగిన్ అవుతున్నప్పుడు మీ బ్రౌజర్లో బ్రౌజర్ సేవ్ పాస్వర్డ్ను సేవ్ చేయవచ్చు. అయితే, మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ను ఇంకెవ్వరూ ఉపయోగించే నిర్ధారించుకోండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :