Friday, November 27, 2020

Flipkart Black Friday Sale



Read also:

Flipkart Black Friday Sale

దేశంలో ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో ప్రత్యేక సేల్ నిర్వహించేందుకు రెడీ అయ్యింది. వినియోగదారులకు ఆకట్టుకునేందుకు బ్లాక్ ఫ్రైడే పేరుతో సేల్ ను ప్రారంభించింది.

దేశంలో ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో ప్రత్యేక సేల్ నిర్వహించేందుకు రెడీ అయ్యింది. వినియోగదారులకు ఆకట్టుకునేందుకు బ్లాక్ ఫ్రైడే పేరుతో సేల్ ను ప్రారంభించింది. దీనిలో భాగంగా నవంబర్ 27 నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. బ్లాక్ ఫ్రైడే సేల్లో షియోమి, శామ్‌సంగ్, ఒప్పో, రియల్‌మీ, ఆపిల్, మోటరోలాతో సహా వివిధ బ్రాండ్లపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. అంతేకాక, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బిఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ పై ఓ లుక్కేద్దాం.

Samsung Galaxy S20+

భారతదేశంలో లభించే ఉత్తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 ప్లస్. ఫ్లిప్కార్డ్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా ఈ స్మార్ట్ఫోన్ రూ .49,999లకే లభిస్తుంది. ఎస్ 20 ప్లస్ అందుబాటు ధరలోనే పూర్తిస్థాయి ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని అందిస్తుంది.

Asus ROG Phone 3

గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడేవారికి ఆసుస్ ROG ఫోన్ 3 బెస్ట్ ఛాయిస్. ఫ్లిప్కార్ట్ బ్యాక్ ఫ్రైడే సేల్లో భాగంగా ROG ఫోన్ 3 కేవలం రూ .46,999లకే లభిస్తుంది. బేస్ 8GB /128GB కాన్ఫిగరేషన్ మాత్రం రూ .46,999లకే లభిస్తుంది.

Apple iPhone SE (2020)

పాత ఆపిల్ ఐఫోన్ను అప్‌గ్రేడ్ చేయాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్ ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ. ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా కొత్త ఐఫోన్ ఎస్‌ఈ (2020) బేస్ వేరియంట్‌ రూ .32,999లకే లభిస్తుంది. ఐఫోన్ SE (2020) అందుబాటు ధరలోనే ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్, ఐపి రేటింగ్, ప్రైమరీ కెమెరా వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది.

Samsung Galaxy Note 10+

ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ స్పేస్ వచ్చే శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ స్మార్ట్ఫోన్ రూ.54,999లకే లభిస్తుంది. స్టైలస్ సపోర్ట్తో వచ్చే గెలాక్సీ నోట్ 10 ప్లస్ పూర్తిస్థాయి ఫ్లాగ్‌షిప్ రేంజ్లో వచ్చే బెస్ట్ స్మార్ట్ఫోన్గా నిలిచింది.

LG G8X ThinQ

సాధారణంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రీమియం ధరకే లభిస్తాయి. అయితే, LG G8X ThinQ డ్యూయల్ స్క్రీన్ అనుభవాన్ని సరసమైన ధరలోనే పొందవచ్చు. ఇది ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో రూ.27,999లకే లభిస్తుంది.

Realme X3 Series

ప్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా రియల్మీ ఎక్స్ 3 సిరీస్ స్మార్ట్ఫోన్ రూ .22,999లకే లభిస్తుంది. రియల్‌మీ ఎక్స్‌ 3 సూపర్‌జూమ్‌ మాత్రం రూ.23,999 రూపాయలకు లభిస్తుంది. దీనిలోని ఫీచర్లకు కూడా రియల్మే ఎక్స్ 50 ప్రో మాదిరిగానే ఉంటాయి.

Samsung Galaxy A70s

ప్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా శామ్సంగ్ గెలాక్సీ A70 స్మార్ట్ఫోన్ రూ .17,999లకే లభిస్తుంది. ఈ మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్ భారీ OLED ప్యానెల్, ట్రిపుల్ కెమెరా సెటప్, బెస్ట్ బ్యాటరీని చాలా సరసమైన ధరలోనే అందిస్తుంది.

Realme Narzo 20 Pro

ప్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా రియల్మీ నార్జో 20 ప్రో రూ .13,999 లకే లభిస్తుంది. నార్జో 20 ప్రో క్వాడ్-కెమెరా సెటప్, హై-రిఫ్రెష్-రేట్ డిస్ప్లే, సూపర్ ఫాస్ట్ 65W ఛార్జింగ్‌ ఫీచర్లతో అందుబాటు ధరలోనే లభిస్తుంది.

Moto G9

తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ఫోన్ కోసం చూసే వారికి మోటో జి9 గొప్ప ఎంపికగా చెప్పవచ్చు. ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా మీరు దీన్ని రూ .9,999లకే పొందవచ్చు. కాగా, మోటరోలా జి 9 ఆగస్టు నెలలో రూ .11,499 లకు భారత మార్కెట్లో లాంచ్ అయింది. పదివేల బడ్జెట్ రేంజ్లో వచ్చే ఈ స్మార్ట్ఫోన్లో మోటరోలా అద్భుతమైన సాఫ్ట్‌వేర్‌ను కూడా అందిస్తుంది.

Google Pixel 4a & Moto G 5G

మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్లుగా పేరొందిన పిక్సెల్ 4 ఎ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా సరసమైన ధర వద్ద ఫ్లాగ్‌షిప్ కెమెరా అనుభవాన్ని అందిస్తుంది. కాగా, మోటో జి5 భారతదేశపు అత్యంత సరసమైన 5 జి ఫోన్‌గా ప్రసిద్దికెక్కింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :