Monday, November 30, 2020

EPFO WhatsApp Helpline numbers



Read also:

EPFO WhatsApp Helpline ఈపీఎఫ్ఓ ఇటీవల వాట్సప్ హెల్ప్‌లైన్ ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు సంప్రదించాల్సిన వాట్సప్ నెంబర్ల గురించి తెలుసుకోండి.

1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఇటీవల వాట్సప్ హెల్ప్‌లైన్ సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షలాది మంది ఈపీఎఫ్ ఖాతాదారులు వాట్సప్ ద్వారా సేవలు పొందుతున్నారు.

2. ఇప్పటికే ఈపీఎఫ్ ఐ గ్రీవియెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్-EPFiGMS పోర్టల్, సెంట్రలైజ్డ్, పబ్లిక్ గ్రీవియెన్స్ రీడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్-CPGRAMS, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, ప్రత్యేకంగా కాల్ సెంటర్ ద్వారా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు సేవలు అందిస్తోంది ఈపీఎఫ్ఓ.

3. ఇటీవల కొత్తగా వాట్సప్ హెల్ప్‌లైన్ సర్వీస్ కూడా ప్రారంభించింది. అయితే ఒకే హెల్ప్‌లైన్ నెంబర్ ఉన్నట్టు ఒకే వాట్సప్ నెంబర్ ఉండదు. ప్రాంతాలను బట్టి వాట్సప్ నెంబర్లు మారుతుంటాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, కడప, రాజమండ్రి ప్రాంతాలకు వేర్వేరు వాట్సప్ నెంబర్స్ ఉంటాయి.

4. జోనల్ ఆఫీస్‌లోని రీజనల్ ఆఫీసులకు ప్రత్యేకంగా ఈ వాట్సప్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఆయా రీజనల్ ఆఫీస్‌లో ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారు సంబంధిత నెంబర్లను మాత్రమే వాట్సప్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాలకు ఏ వాట్సప్ నెంబర్ కేటాయించారో తెలుసుకోండి.

5. తెలంగాణలో హైదరాబాద్ జోనల్ ఆఫీస్‌ పరిధిలో చూస్తే హైదరాబాద్ (బర్కత్‌పుర)- 9100026170, హైదరాబాద్ (మాదాపూర్)- 9100026146, కరీంనగర్- 9492429685, కూకట్‌పల్లి- 9392369549, నిజామాబాద్- 8919090653, పటాన్‌చెరు- 9494182174, సిద్దిపేట్- 9603262989, వరంగల్- 8702447772 నెంబర్లను సంప్రదించొచ్చు.

6. ఆంధ్రప్రదేశ్- విజయవాడ జోనల్ ఆఫీస్ పరిధిలో చూస్తే గుంటూరు- 0863-2344123, కడప- 9491138297, రాజమండ్రి- 9494633563, విశాఖపట్నం 7382396602 నెంబర్లలో సంప్రదించాలి.

7. మీకు ఈపీఎఫ్ అకౌంట్‌కు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ముందుగా మీ రీజనల్ ఆఫీస్ ఏదో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ రీజనల్ ఆఫీస్‌కు కేటాయించిన వాట్సప్ నెంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి.

8. ఉదాహరణకు మీ ఈపీఎఫ్ అకౌంట్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ బర్కత్‌పుర అయితే 9100026170 వాట్సప్ నెంబర్‌ను కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా దేశంలోని 138 రీజనల్ ఆఫీసులకు వేర్వేరు వాట్సప్ నెంబర్లను కేటాయించింది ఈపీఎఫ్ఓ. ఆ వివరాలను ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :